నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్..
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల సాయి నగర్ కాలనీలో నాలుగు రోజులుగా త్రాగునీరు రావడంలేదని కాలనీవాసులు మంగళవారం రోజు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. గత నాలుగు రోజులుగా తాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు పేర్కొన్నారు. త్రాగునీరు రావడం లేదని సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చిన స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా చేయడంతో వాహనాలు అక్కడికక్కడే భారీగా నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి త్రాగునీరు సరఫరా అయ్యేవిధంగా చూస్తామని అధికారులు తెలపడంతో కాలనీవాసులు ధర్నా విరమింపజేశారు.