
– రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి వినతిపత్రమందజేసిన లబ్ధిదారులు
నవతెలంగాణ – బెజ్జంకి
గత ప్రభుత్వం గుర్తించిన రెండవ విడత దళితబందు లబ్ధిదారులకు త్వరితగతిన న్యాయం చేయాలని మండలంలోని అయా గ్రామాలకు చెందిన సుమారు వంద మంది లబ్ధిదారులు సోమవారం హైదారాబాద్ యందు ప్రజా భవన్ వద్ద బైఠాయించి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలేవైనా దళితుల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించి దోహదపడాలని, రెండవ విడత దళిత బందులో లబ్ధిదారులుగా గుర్తించిన వారికి న్యాయం చేసేల ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి గ్రౌండింగ్ ప్రక్రియ చేపట్టాలని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు లబ్ధిదారులు వినతిపత్రమందజేసినట్టు అంబేడ్కర్ యువజన సంఘం మండలాధ్యక్షుడు దీటీ బాలనర్స్ తెలిపారు. లబ్ధిదారుల వినతిపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు బాలనర్స్ తెలిపారు. దళిత బందు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోగిల మహేష్,కనగండ్ల రాజేశం, బెజ్జంకి కిష్టయ్య,బిగుల్ల మోహన్,బామండ్ల లక్ష్మణ్,కనగండ్ల సురేశ్,బిగుల్ల సుధర్శన్,మాశం బాబు,జంగిటి శంకర్,మాంకాల స్వామి,బెజ్జంకి అనిల్,పొత్తూరి అంజి,కనగండ్ల శ్రీనివాస్,లింగాల అర్జున్ పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.