– ప్రభుత్వ బడులు మూతపడేలా వ్యవహరిస్తున్న కమిషనర్
– పాఠశాలలను బాగుచేసే డైరెక్టర్‌ను నియమించాలి :సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల నిర్వహణ కోసం ప్రభుత్వ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు విధులను వేయొద్దని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనకు ఆయన బుధవారం లేఖ రాశారు. ఈ ఏడాది దాదాపు పదివేల మంది ప్రభుత్వ ఉపాధ్యా యులకు ఇంటర్ పరీక్షల విధులను వేశారని తెలిపారు. ఆయా పాఠశాలల్లో విద్యాసంవత్సరం చివరిలో చదువు అంతంత మాత్రంగానే కొనసాగుతుందని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవ త్సరంలో ఈ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ఇంకా తగ్గిపోతుం దని వివరించారు. ఈ క్రమం ఇలాగే కొనసాగితే రాబోయే నాలు గేండ్ల తర్వాత ప్రభుత్వ బడులు నామమాత్రంగానే మిగులుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడు ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం ఉపాధ్యాయులకు విధులు వేస్తారా?, ఆ విధులను ఎవరు చేస్తారు?అని ప్రశ్నించారు. ఇంటర్ విద్యార్థులకు బోధించే ప్రభుత్వ, ప్రయివేటు అధ్యాపకులు చేస్తారని తెలిపారు. ఇప్పుడూ అదే పని చేయాలంటూ జనవరి, ఫిబ్రవరిలో పాఠశాల విద్యాశాఖ కమిషనర ్‌కు లేఖలు రాశానని గుర్తు చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాస్తే తగు చర్య తీసుకో వాలంటూ కమిషనర్‌కే ఆయన పంపిం చారని పేర్కొన్నారు. ఈ విషయంలో కీలకంగా వ్యవహరించాల్సిన కమిషనర్ మాత్రం చాలా ఉదాసీనంగా వ్యవహరి స్తున్నారని విమర్శిం చారు. ప్రాథమిక విద్యలో ప్రమాణాలు సరిగా లేవం టూ ఫండమెంటల్ లిటరసీ, న్యూమరసీ (ఎఫ్‌ఎల్ ఎన్) కార్యక్రమాన్ని గతేడాది నుంచి నిర్వహిస్తున్నా రని తెలిపారు. విద్యాసంవత్సరం చివరలో మాత్రం యధాలాపంగా ఉపాధ్యాయులను ఇంటర్, పదో తరగతి పరీక్షల విధులకు, టెన్త్ మూల్యాంక నానికి అనుమతిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను క్రమంగా మూసేయాలనే లక్ష్యంతో వారు పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నదని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రికి ఈ విషయంపై లేఖ రాశాననీ, ఎలాంటి చర్య కనిపించలేదని తెలిపారు. శాసన మండలిలో ప్రస్తావన చేయబోతే నాటి అధికారపక్షం సంఖ్యా బలంతో మూకదాడి చేసిందని పేర్కొన్నారు.