నల్ల బంగారం వేలానికి పెట్టొద్దు

– సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-పాల్వంచ
నల్ల బంగారం వేలానికి పెట్టొద్దని సీఐటీయూ జిల్లా ఉపాధ్యాకులు, దొడ్డ రవి, పట్టణ కార్యదర్శి కె.సత్య అన్నారు. బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పాల్వంచ పట్టణంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని 60 బొగ్గుబావులను ప్రయివేటీకరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వేలం ప్రక్రియకు వ్యతిరేకంగా అన్ని రంగాల కార్మికులు ఉద్యమించాలని అన్నారు. మిగతా కార్మిక సంఘాలు కూడా ఈ పోరాటాలో కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రవికుమార్‌ పట్టణ కన్వీనర్‌ కే సత్య, కార్మికులు గట్టాయ, మహేష్‌, సాయి, శ్రీను, సమేలు తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట బొగ్గు బ్లాకుల వేలం పాట ఆపాలని, సింగరేణి బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్‌ డిమాండ్‌ చేశారు. శనివారం మందలపల్లిలో మధ్యాహ్నం భోజనం కార్మికులు ఆధ్వర్యంలో బొగ్గు బ్లాకుల ప్రవేయిటీకరణ నిరసిస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అర్జున్‌ మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా సిరుల సింగరేణి దొడ్డి దారిన ప్రయివేటీకరణ పేరుతో పారిశ్రామికవేత్తలకు అప్పగించటం దురదృష్టం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జయ, నాగేంద్ర, అరుణ, దేవమాత, హరిక తదితరులు పాల్గొన్నారు. టేకులపల్లి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రయివేటీకరణ వేగవంతం చేస్తుందని, బొగ్గు బ్లాకుల వేలం పాటను ఉపసంహరించుకోవాలని శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్‌ నబీ మాట్లాడారు. అందులో భాగంగానే కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్‌ రెడ్డి మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 60 బొగ్గు బ్లాకులను వేలం వేయడం కోసం వేదిక ఏర్పాటు చేశారన్నారు. బొగ్గు బ్లాకుల వేలం పాట నిలిపివేయకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ములకలపల్లి బొగ్గు బావుల ప్రయివేటీకరణను తక్షణమే ఆపాలని సీఐటీయూ మండల కన్వీనర్‌ నిమ్మల మధు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సింగరేణి కార్మికులకు మద్దతుగా శనివారం మండల కేంద్రంలోని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్‌లను కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టడం ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ సావిత్రి, ముదిగొండ లక్ష్మి, మంద పురి రాజమ్మ, కందుకూరి విజయ కుమారి, అరుణ, బొమ్మగాని సైదమ్మ, వాసం వెంకటరమణ, గణప లక్ష్మి, గణప ఆదిలక్ష్మి, బిబినేని కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Spread the love