నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గ్రామానికి చెందిన బోదాసు ఎల్లయ్య మ్యూజిక్ సిస్టం, స్పీకర్, మైక్ సెట్ వితరణ చేశారు. ఈ మేరకు శనివారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రూ. 20వేల విలువైన మ్యూజిక్ సిస్టం, స్పీకర్, మైక్ సెట్ ను స్థానిక సర్పంచ్ రిక్కల అరుణ్ రెడ్డి చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చౌడవరపు రాంప్రసాద్ కు అందజేశారు. పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాల్లో, ప్రార్థన సమయాల్లో సౌండ్ సిస్టం లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న బోదాసు ఎల్లయ్య మ్యూజిక్ సిస్టం, స్పీకర్, మైక్ సెట్ విరాళంగా అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్థుల, ఉపాధ్యాయుల తరఫున దాత బోదాసు ఎల్లయ్యకు ప్రధానోపాధ్యాయులు రాంప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలం క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అంజయ్య , ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
కోనాపూర్ ఉన్నత పాఠశాల కు మైక్ సెట్, స్పీకర్ వితరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


