రానివారు నిరాశపడొద్దు.. ఇది నిరంతర ప్రక్రియ.. ప్రతి నెలకు చెక్కుల పంపిణీ..

– అర్హులందరికీ బీసీ బంధు అందిస్తాం..
– ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్..
నవతెలంగాణ -డిచ్ పల్లి
బీఆర్ఎస్  ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల  జీవితాల్లో వెలుగులు నింపుతోందని, కులవృత్తులకు జీవం పోయడంతో పాటుగా ప్రతి కార్మికుడు కార్మికుడిగా మిగిలి పోకుండా యజమాని కావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నిరుపేద కుటుంబాలకు బీసీ బంధు పథకం ద్వారా  లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారనీ వచ్చిన వారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.శుక్రవారం భారతి గార్డెన్ లో బిసి బంధు చెక్కులను డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన లాబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో ఉన్న నిరుపేదలను గుర్తించి నా దృష్టికి తీసుకురావాలని సూచించారు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా కంటతడి పెట్టకూడదని, అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందేలా చర్యలు తీసుకుంటున్నమన్నారు. ప్రజాప్రతినిధులు సేవాభావంతో, నిరుపేదలను ఆదుకోవాలని, మీకు చేతనైన సాయం చేయాలని సూచించారు.ఇది ఆరంభం మాత్రమేనని,ఇది నిరంతర ప్రక్రియగా చేపడతామన్నారు. దశల వారీగా అర్హులైన వారందరికీ అందిస్తామని ఎవరు దిగులు చేందవద్దన్నరు.
    కుల వృత్తులు బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేసి కుల వృత్తిపైన ఆధారపడిన వారందరికీప్రోత్సాహకంగా స్వయం ఉపాధి పొందేలా సీఎం కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ తన కాళ్లపై తాను నిలవడానికి ఈ లక్ష రూపాయలు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్, ఉమ్మడి జిల్లాల డిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, మండలాల అధ్యక్షులు చింత శ్రీనివాస్ రెడ్డి,చిలువెరి గంగా దాస్, ఎంపిటిసి చింతల దాస్,బీరిష్ శేట్టి, ప్రవీణ్ గౌడ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love