అధైర్యపడొద్దు..అందరికి అండగా ఉంటా: ఎమ్మెల్యే

– ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి 

– నియంతృత్వ పాలనను సాగనంపిన ప్రజల సేవే పార్టీ లక్ష్యం
– ఎంపీ బండి బీజేపీ ప్రభుత్వంపై మండిపాటు 
– ఎంపీ ఎన్నికల అనంతరం కరీంనగర్ లోకి బెజ్జంకి
నవతెలంగాణ – బెజ్జంకి 
మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్కరిని మరువకుండా అందరికి అందుబాటులో ఉంటూ పని చేస్తానని..పాతవారు..కొత్తవారనే మనస్పర్థలకు తావులేకండా ఎవరు అదైర్యపడొద్దని అందరికి అండగా ఉంటానని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నాయకులకు,కార్యకర్తలకు సూచించారు.బుధవారం మండల కేంద్రంలోని సత్యార్జునా గార్డెన్ యందు మడలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి అధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అవిర్భావ అనంతరం పదేండ్లు నియంత, ప్యూడల్ సాగిన పరిపాలనలో ప్రజలు,కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని..ప్రజలిచ్చిన అవకాశాన్ని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు కలిసికట్టుగా పని చేయాలన్నారు.అందరూ బేషజాలు వీడి మండలాభివృద్ధిలో బాగాస్వాములవ్వాలని సూచించారు.కష్టపడిన ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందని.. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.అనంతరం మండలంలోని అయా గ్రామాల అధ్యక్షులను ఎమ్మెల్యే శాలువా కప్పి ఆహ్వానించారు. నాయకులు దామోదర్,పులి క్రిష్ణ,శ్రవణ్, శ్రీనివాస్ రెడ్డి,రొడ్డ మల్లేశం,కనగండ్ల జ్యోతి,ప్రవీన్,లింగాల శ్రీనివాస్,మధుసూదన్ రెడ్డి,రావుల నర్సయ్య,మానాల రవి,డీవీ రావు,నాగారాజు,చెప్యాల శ్రీనివాస్, జెల్లా ప్రభాకర్,అయా గ్రామాల నాయకులు,కార్యకర్తలు హజరయ్యారు.
అల్లర్లు సృష్టించి ఒట్లు దండుకోవడమే బీజేపీ లక్ష్యం:  దేశభక్తి,రాముని పేరునా ప్రజలను మోసం చేస్తోందని..మతం ముసుగులో అల్లర్లు సృష్టించి ఒట్లు దండుకోవడమే బీజేపీ లక్ష్యమని ఎమ్మెల్యే కవ్వంపల్లి అగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీ ప్రభుత్వం నీరుపేదలను దోచి సంపన్నులకు ప్రజాధనాన్ని, ప్రభుత్వ రంగ అస్తులను కట్టబెట్టిందని ఆరోపించారు.కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ చేసిన అభివృద్ది పనులేమిటో చూపించి ఈ ఎంపీ ఎన్నికల్లో ప్రజలను ఒట్లడగాలన్నారు.
కరీంనగర్ లోకి బెజ్జంకి: మండల నాయకుడు ఐలేని శ్రీనివాస్ రెడ్డి బెజ్జంకి మండలాన్ని తిరిగి కలుపాలని కోరగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పునర్విభజన చేపడుతాడని తెలిపారు.ఎంపీ నియోజకవర్గ పరిధిలో జిల్లాల పునర్విభజన జరుగుతుందని..ఎంపీ ఎన్నికల అనంతరం కరీంనగర్ జిల్లాలో బెజ్జంకి మండలం తిరిగి కలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
Spread the love