Tuesday, May 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని మోసపోవద్దు: ఎమ్మెల్యే

ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని మోసపోవద్దు: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
రైతులు మొక్కజొన్న పంటను దళారులకు అమ్ముకొని మోసపోవద్దని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మద్నూర్, డోంగ్లి మండలాల్లో మొక్కజొన్న మద్దతు ధర కొనుగోలు కేంద్రాలను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంట ప్రభుత్వం కొనుగోలు చేయడానికే మద్దతు ధర కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. మొక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. మొక్కజొన్న మద్దతు ధర క్వింటాలుకు రూ.2400 ప్రకటించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇరు మండలాల సర్పంచులు, మొక్కజొన్న రైతులు, తిరుమలలో సింగిల్ విండోల కార్యదర్శిలు, ఇరు మండలాల సింగిల్ విండోల పర్సనల్ ఇన్చార్జులు, మద్నూర్ మార్కెట్ కమిటీ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -