భవిష్యత్తును హరించే ఇథనాల్ పరిశ్రమ మాకొద్దు 

– ఇథనాల్ నిర్మాణ పనులపై భగ్గుమన్న గుగ్గీల్ల, తిమ్మాయిపల్లి గ్రామస్తులు
– పరిశ్రమ ప్రతినిధులను గ్రామ పంచాయతీలో నిర్భందించిన గ్రామస్తులు 
– ఏసీపీ సురేందర్ రెడ్డి హమీతో సద్దుమనిగిన గ్రామస్తులు 
నవతెలంగాణ – బెజ్జంకి 
గ్రామీణ ప్రజల భవిష్యత్తును హరించే ఇథనాల్ పరిశ్రమ మాకొద్దంటూ మండల పరిధిలోని గుగ్గీల్ల,తిమ్మాయిపల్లి గ్రామస్తులు పరిశ్రమ ప్రతినిధులు,పోలీసుశాఖ అధికారుల ఎదుటపురుగుల మందుల డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. బుధవారం గుగ్గీల్ల గ్రామ శివారులో ఇథనాల్ పరిశ్రమ నిర్మాణ పనులు చేపడుతున్నారనే సమచారంతో భగ్గమన్న గుగ్గీల్ల, తిమ్మాయిపల్లి గ్రామస్తులు పరిశ్రమ ప్రతినిధులను గుగ్గీల్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్భందించారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు పరిశ్రమ ప్రతినిధులకు భద్రత ఏర్పాటుచేశారు.గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ ప్రజలకు ఇథనాల్ పరిశ్రమపై నెలకొన్న వాగ్వాదాంపై సీఐ శ్రీనివాస్ గ్రామస్తులను సద్దమణిగించే యత్నం చేయగా ఇథనాల్ పరిశ్రమ నిర్మాణం మేము వద్దంటున్నాం..ప్రజాభిప్రాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని..అధికారులు ప్రజలకు సహకరించాలని గ్రామ మహిళలు అగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న ఏసీపీ సురేందర్ రెడ్డి పంచాయతీ కార్యాలయ  వద్ద గ్రామ ప్రజలతో మాట్లాడారు.ఇథనాల్ పరిశ్రమ యాజమాన్యం నిర్మాణ పనులు ప్రారంభిస్తోందని.. పరిశ్రమ నిర్మాణం వల్ల భవిష్యత్తులో జీవనానికి మనుగడ లేకుండా పోతోందని పోలీసుశాఖ అధికారులు సహకరించాలని ఏసీపీకి గ్రామస్తులు ప్రాదేయపడ్డారు.పరిశ్రమ నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రాంతాన్ని ఏసీపీ,సీఐ,ఎస్ఐతో కలిసి సందర్శించి పరిశీలించారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పోలీసుశాఖ వ్యవహరించదని.. పరిశ్రమ నిర్మాణ పనులపై విధ్వంసానికి పాల్పడితే చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమని ఏసీపీ సురేందర్ రెడ్డి గ్రామస్తులను హెచ్చరించారు.
ప్రయాణం ప్రమాధకరంగా మారిందని:
గుగ్గీల్ల గ్రామానికి వేళ్లే ప్రధాన రోడ్డు ప్రక్కన నిర్మించిన ఆర్ఆర్ సీ పారాబాయిల్డ్ రైస్ మిల్, మైత్రి సాల్వంట్ పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాలతో దుర్వాసన,దూళితో రాత్రి సమయంలో వాహనదారులకు ప్రయాణం ప్రమాధకరంగా మారిందని తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని గుగ్గీల్ల గ్రామస్తులు పారాబాయిల్డ్ రైస్ మిల్ ను ముట్టడించారు.సీఐ శ్రీనివాస్ యాజమాన్యంతో సంప్రదించి సమస్యను పరిష్కరించేల కృషి చేస్తామని సూచించడంతో గ్రామస్తులు అందోళనను విరమించారు.
Spread the love