వ్యక్తిగత పరిశుభ్రతతో అంటురోగాలు కు స్వస్తి: డాక్టర్ రాందాస్

నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా అనేక అంటు రోగాలకు స్వస్తి పలక వచ్చని అశ్వారావుపేట(వినాయకపురం) ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రాందాస్ తెలిపారు. అశ్వారావుపేట లోని మహాత్మా జ్యోతిరావు పూలే, ముస్లిం మైనారిటీ ఆశ్రమ గురుకుల పాటశాలల్లో మంగళవారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహ పరిసరాలలో పాటు విద్యార్థులు వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని సూచించారు. వసతి గృహాలలో కండ్ల కలక వచ్చిన వారిని పరీక్షించి,చుక్కల మందు పంపిణీ చేశారు.ఇది వైరస్ వల్ల వస్తుందని,ఒకరికి వస్తే దాదాపు అందరికీ వస్తుందని,భయ పడాల్సిన పని లేదని, విద్యార్థులు ఎవరి దుస్తులు వారు ప్రత్యేకంగా  ఉంచుకోవాలని,తరచూ చేతులు సబ్బు తో శుభ్రం చేసుకుంటే మూడు నాలుగు రోజులలో తగ్గి పోతుందని వివరించారు.వసతి గృహం లో ఆరుగురు విద్యార్దులకు రాడికల్ రక్త పరీక్షలు చేయగా, అందరికీ నెగెటివ్ రిపోర్ట్ లు వచ్చాయి ఆని సూపర్ వైజర్ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమం లో ఆరోగ్య సహాయకుడు ప్రసాద్,స్టాఫ్ నర్స్ గాయత్రి, పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love