– ఒక్కో రైతు వేదికలో వేయి మంది వసతులు….
– మండల స్థాయి అధికారులు పర్యవేక్షణ…..
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ అవతరణ పురస్కరించుకుని ఈ నెల రెండు నుండి 22 వరకు రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా 3 వ, తేదీ శనివారం తెలంగాణ రైతు దినోత్సవం నిర్వహించనుంది. ఇందుకోసం మండలంలోని వ్యవసాయ విభాగం క్లస్టర్ లో నిర్మించిన రైతు వేదికలునే రైతు దినోత్సవం వేడుకలకు వేదికలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో వేదికకు మండల స్థాయి అధికారి పర్యవేక్షణలో,వ్యవసాయ శాఖ ఎ.ఇ.ఓ,పంచాయితి కార్యదర్శులు సమన్వయంతో వేయి మందికి సరిపడా వసతులు కల్పిస్తున్నారు. మండలంలోని పేరాయిగూడెం, నారాయణపురం, తిరుమలకుంట, అనంతారం రైతు వేదికలు కు ఈ వరుస క్రమంలో ఎం.పీ.ఈ.ఓ సీతారామరాజు, మిషన్ భగీరథ ఎ.ఇ శ్రీను, ఎస్.ఆర్.పి ఎ.ఇ శ్రీ కుమార్, ఎం.పి.డి.ఒ శ్రీనివాసరావులు ప్రత్యేక అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ పనులను మూడు రోజుల ముందుగానే గురువారం వారు ప్రారంభించారు. ముందుగా రైతు వేదికల పరిసరాలను శుభ్రం చేయడం,వేదికలను రంగు రంగుల విద్యుత్ బల్బులు తో అలంకరించడం, వేదికను రూపొందించడం, ఇందులో వ్యవసాయ శాఖ లబ్ధిదారులు, రైతు బంధు లబ్ధిదారులు ను సమీకరించడం, ప్రభుత్వం పనితనాన్ని వారితో నే వివరించడం,పధకాలను ప్రచారం చేయడం, చివరిగా భోజన సౌకర్యం కల్పిస్తారు.