నవతెలంగాణ-కంటేశ్వర్
కాంగ్రెస్ భవన్ నందు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ కమిటీ మానాల మోహన్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హంధన్, పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, యూత్ కాంగ్రెస్ ఇంఛార్జి రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ హైదరాబాదులో చేసిన యూత్ డిక్లరేషన్ నిజామాబాద్ నగరంలో చాలా ఉపయోగపడుతుందని, అందులో పేర్కొన్న అంశాలను ప్రతి నిరుద్యోగ యువతకు తెలియజేయవలసిన బాధ్యత అందరిపైనా ఉందనీ, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని, దానికి పక్కా ప్రాణాలికతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. ప్రియాంక గాంధీ గారు చేసిన యూత్ డిక్లరేషన్ ను ఇంటింటికి ప్రచారం చేయాలని ఆయన తెలియజేశారు. డివిజన్ కమిటీలను నియమించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడుతుందని, నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ తరపున జరిగే కార్యక్రమాలు అన్ని కాంగ్రెస్ పార్టీ జెండా కింద మాత్రమే జరుగుతాయని, ఏలాంటి వ్యక్తికి సంబంధించిన కన్సల్టేషన్ కింద కాదని ఆయన తెలియజేశారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి ప్రతి డివిజన్ లో కార్యక్రమాలు నిర్వహించాలని తద్వారా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని ఆయన అన్నారు. అదేవిధంగా జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి జాతీయ జెండా ఎగురవేయాలని, అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా ఆ రోజును ఎంతో ఘనంగా పురస్కరించుకోవాల్సి ఉన్న సందర్భంగా నిజామాబాద్ నగరంలో 500 బైక్లతో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని ,ప్రతి డివిజన్ అధ్యక్షులు తమ తమ డివిజన్లో పార్టీ జాతీయ జెండా ఎగరవేసి సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని, అదే విధంగా తమ వంతుగా డివిజన్కు 10 బైక్లను తీసుకొని కాంగ్రెస్ భావం వద్దకు ఉదయం 10:30 కు రావాలని ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి తెలియజేశారు.ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశ వేణు మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ని స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 18వ తేదీన రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుందని, జూన్ 17వ తేదీ వరకు 7661899899 ఈ నెంబర్కు మిస్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చిన వెబ్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రాజీవ్ గాంధీ యూత్ క్విజ్ కాంపిటీషన్లో జిల్లా మరియు నగర యువకులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా నిజామాబాద్ నగరంలోని అన్ని డివిజన్లో హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని, జూన్ రెండవ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా జాతీయ జెండా ఎగురేసి,సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామని, బైక్ ర్యాలీని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి డివిజన్ కమిటీలను పార్టీ కోసం పనిచేసే ఉస్తహవంతమైన కార్యకర్తలతో 21 మందితో నియమించాలని, ప్రతి బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేశ వేణు తెలియజేశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలించిన సమయంలో ఎం చేసిందని బిజెపి, టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని,కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశాన్ని విచ్ఛిన్నం కాకుండా చూసిందని, తెరాస పార్టీ ప్రాంతీయ సెంటిమెంటు తో,బిజెపి పార్టీ మత పరమైన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపధ్యక్షుడు రమర్థి గోపి,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్,జిల్లా ఎన్ ఎస్ ఏ అద్యక్షులు వేణు రాజ్, రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి విపుల్ గౌడ్,జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ జావేద్ అక్రమ్,జిల్లా ఓ బి సి అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, పిసిసి కార్యదర్శి రామ కృష్ణ,సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రత్నాకర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబుధ్ బిన్ హందం,కార్పొరేటర్ రోహిత్, చంద్రకళ, ఉష,మలైకా బేగం, పద్మ, రామ కృష్ణ, సంతోష్, రేవతి, డివిజన్ అధ్యక్షులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.