– ఓదార్చిన ఎమ్మెల్యే మెచ్చా,సీపీఎం నాయకులు చిరంజీవి..
– మేము సైతం సహాయం చేస్తాం
– ఆసరాగా నిలుస్తున్న పౌర సమాజం
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యుత్ ఘాతం తో మండలంలోని మల్లాయిగూడెం పంచాయితీ,తాటి నాగులు గుంపు కు చెందిన కుంజా మంగమ్మ అనే పేద రాలు పూరిళ్ళు శుక్రవారం దగ్ధం అయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ నారం రాజశేఖర్ వెంటనే స్పందించి తక్షణ సహాయంగా రూ 5 వేలు ఆర్ధిక సహాయం చేసారు. శనివారం సీపీఐ (ఎం) మండల కార్యదర్శి చిరంజీవి నేతృత్వం లో బియ్యం,నిత్యావసరాలు సేకరించి గ్రామ శాఖ ఆధ్వర్యంలో అందజేసారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దగ్ధం అయిన గృహం సందర్శించి మంగమ్మ ను ఓదార్చారు. అనంతరం తెరాస గ్రామీణ ప్రాంత నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు నేతృత్వం నామ ముత్తయ్య ట్రస్ట్,మెచ్చా నాగేశ్వరరావు ఆర్ధిక సౌజన్యంతో రూ.10 వేలు విలువ గల నిత్యావసర సామాగ్రిని, ప్రముఖ వ్యాపారి తోకల సురేష్ ఆద్వర్యంలో వ్యాపార బృందం సభ్యులు, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శీమకుర్తి సుబ్బారావు, భోగవల్లి రాంబాబు లు నిత్యావసరాలు అందజేసారు.