Wednesday, May 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి పనులను పరిశీలించిన డీఆర్‌డీఓ

ఉపాధి పనులను పరిశీలించిన డీఆర్‌డీఓ

- Advertisement -

– కూలీలకు జాగ్రత్తలు, అధికంగా పనులకు రావాలని సూచన
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం పిరట్వానిపల్లి గ్రామ పరిధిలో కొనసాగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను డీఆర్‌డీఓ చిన్న ఓబులేష్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పని ప్రదేశంలో కూలీలతో మాట్లాడిన ఆయన ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పని సమయంలో తగినంత నీరు తాగడం, తలకు గుడ్డ కట్టుకోవడం, అలసట అనిపించినప్పుడు విశ్రాంతి తీసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

అలాగే గ్రామాల్లోని అర్హులైన కూలీలు అధిక సంఖ్యలో ఉపాధి పనులకు హాజరుకావాలని కోరారు. ఉపాధి ద్వారా వచ్చే కూలీ డబ్బులు కుటుంబ అవసరాలతో పాటు పిల్లల చదువులకు, దైనందిన ఖర్చులకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుప్రియ, ఏపీవో పర్వతాలు, పంచాయతీ కార్యదర్శి హరిప్రసాద్, ఫీల్డ్ అసిస్టెంట్ లక్కీరామ్, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -