Sunday, August 9, 2026
E-PAPER
Homeదర్వాజరెక్కల కలలు

రెక్కల కలలు

- Advertisement -

సముద్రానికి, రెక్కలొచ్చిన కెరటాలు
ఆకాశంలో కాగడాలు పాతిన మెరుపులు
గుండెలు, గొంతులు ధ్వనించే
ఉరుముల, పరుగుల, హార్మోనియం లయలు
ఇది తుఫాన్ కాదు
వరద బీభత్సం కాదు
గొప్పమార్పు, కొత్త చేర్పు
ప్రశ్నించే స్వప్నాలు
ప్రసరించే కిరణాలు
పసి ఊహల ఇంద్ర చాపాలు
జీవితాన్ని గౌరవించే ప్రేమికులు
సోయితో కురిసే చినుకుల గలగలలు
పెద్దలను నిలదీసే సౌమ్యులు
జెన్ జీలు, న్యాయంకోసం వేసే అడుగులు
గాలితో తాడు పేనగలరు, పొగలో అద్దాలు బిగించ గలరు
వాసనేదో, పరిమళమేదో గుర్తు పట్టగలరు
చీకటిని నిలదీయగలరు, ఉదయాన్ని కేకేసి పిలవ గలరు
దేశమంతా రాగమై అల్లుకోగలరు
వెల్తురు కోసం, దీపాల్లా కళ్లు వెలిగించ గలరు
జవాబుదారికి, ఉద్యమించ గలరు
జెన్ జీ జెనరేషన్, మండోలిన్ ధ్వనుల అలలు
ఆశారాజు, 9392302245

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -