
మండలంలోని బయ్యక్కపేట్, కాల్వపల్లి గ్రామాలలో గురువారం ఉదయం ములుగు డిఎస్పీ ఎన్ రవీందర్, స్థానిక ఎస్సై ఓంకార్ యాదవ్, పస్రా సిఐ శంకర్ ల తో కలిసి, స్థానికులతో నడుచుకుంటూ, సంభాషించుకుంటూ ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. అనంతరం పోలింగ్ కేంద్రాలను సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ములుగు డిఎస్పి ఎన్ రవీందర్ మాట్లాడుతూ నేరాలను అరికట్టడానికి ఫుడ్ పెట్రోలింగ్ ను పునరుద్ధరించినట్లు తెలిపారు. అంతేకాకుండా పౌరులలో భద్రతాభావాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ ఏసి వర్గీష్, సివిల్ సిఆర్పిఎఫ్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.