నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో పారదర్శకతలోపించి, గోల్మాల్ జరిగినట్టుగా మీడియాలో వస్తున్న కథనాలపై ప్రభుత్వం స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేశ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. లోకల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) టికెట్ల విక్రయాల బాధ్యతలు చేపట్టిన పేటీఎం నిర్వహకులే వాటి అమ్మకాలను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు.