కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై నివేదిక కోరిన ఈసీ

నవతెలంగాణ – హైదరబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి రోజున హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై ఓటర్లు నివ్వెరపోయారు. మరోవైపు ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. కౌశిక్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలపై విచారణ జరపాలని హుజూరాబాద్ ఎన్నికల అధికారులను ఆదేశించింది. వీలైనంత త్వరగా ఆ విచారణ నివేదిక అందించాలని సూచించింది.

Spread the love