ఈఎస్‌ఐ కుంభకోణంలో చార్జిషీట్‌ దాఖలు చేసిన ఈడీ

నవతెలంగాణ – హైదరాబాద్: ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చార్జిషీట్ దాఖలుచేసింది. రూ.211 కోట్ల స్కాం జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఈ కుంభకోణంలో ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణితోపాటు మరో 15 మందిని నిందితులుగా పేర్కొంటూ అభియోగపత్రాలను సమర్పించారు. ఈఎస్ఐలో మందులు, మెడికల్ కిట్ల కొనుగోలులో గోల్‌మాల్ జరిగినట్లు దేవికారాణిపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదుచేసింది. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. ఇప్పటికే నిందితులకు చెందిన రూ.144 కోట్ల ఆస్తులు ఈడీ అటాచ్‌ చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈస్‌ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణం నిందితుల్లో దేవికారాణితోపాటు మాజీ జేడీ పద్మజ, షార్మాసిస్టు కే.నాగమణి, ఇద్దరు కాంట్రాక్టర్లు కే.శ్రీహరిబాబు, పీ.రాజేశ్వరరెడ్డి నిందుతులుగా ఉన్నారు.

Spread the love