ఈడీ విచారణ హాజరైన అంజన్ కుమార్ యాదవ్

నవతెలంగాణ – ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందు విచారణకు మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. యంగ్ ఇండియన్ ఫౌండేషన్ అనే ఛారిటీ సంస్థకు గతంలో రూ.20 లక్షలు విరాళం ఇచ్చారు. గత నవంబర్‌లో ఈడీ విచారణకు అంజన్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం అంజన్ కుమార్ యాదవ్‌కు ఈ నెల 31న విచారణకు రావాలంటూ నోటీసులు పంపారు. ఇప్పటికే గతంలో కూడా ఒకసారి అంజన్ కుమార్ యాదవ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట టీకాంగ్రెస్ నేత అంజన్‌కుమార్ యాదవ్ గత ఏడాది నవంబర్ 23న హాజరయ్యారు. ఈ కేసులో అంజన్ కుమార్ యాదవ్ కంటే ముందుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఐదుగురు.. అంజన్‌కుమార్ యాదవ్, షబ్బీర్ ఆలీ, గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి, గాలి అనిల్ కుమార్‌‌లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు నలుగురు నేతలను అధికారులు విచారించి, వారి స్టేట్‌మెంట్‌లు రికార్డు చేశారు. ఆ తరువాత అంజన్‌కుమార్ యాదవ్ హాజరయ్యారు. కాగా.. నేడు మరోసారి ఆయన విచారణకు హాజరయ్యారు.

Spread the love