తమిళనాడులో 30 ప్రాంతాల్లో ఈడీ సోదాలు

చెన్నై : తమిళనాడులోని 30 ప్రాంతాల్లో మంగళవారం ఇడి సోదాలు నిర్వహించింది. వీటిల్లో డిఎంకె మాజీ కార్యకర్త, చిత్ర నిర్మాత జాఫర్‌ సదిక్‌ నివాసం, చిత్ర దర్శకుడు అమీర్‌ కార్యాలయం వంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. అలాగే బుహారి హోటల్స్‌ ఓనర్‌ బుహరి నివాసంలోనూ ఇడి సోదాలు నిర్వహించింది. రూ 2 వేల కోట్ల డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో గత నెలలో జాఫర్‌ సదిక్‌ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అరెస్టు చేసింది. ఈ కేసును ఎన్‌సిబి, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా విచారణ చేస్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ అధికారుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ కేసు విచారణ ప్రారంభమయింది.

Spread the love