ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు– ముగ్గురు మావోయిస్టులు మృతి
రారుగఢ్‌ : అడవితల్లి మరోమారు రక్తమోడింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో ఆదివారం ఉదయం జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదు రుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. ఈ విషయాన్ని కాంకేర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ ఇందిరా కళ్యాణి ఎలెసెలా తెలిపారు. కోయలిబెడ పోలీసు స్టేషన్‌ పరిధిలో భోమ్రా-హుర్తరై గ్రామా లకు సమీపంలోని అటవీ ప్రాంతంలో డ్రిస్టిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్‌ (డిఆర్‌జి), సరిహద్దు భద్రత బలగాలు (బిఎస్‌ఎఫ్‌)కు చెందిన జవాన్లు.. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను, పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. సుక్మా జిల్లాలోని బుర్కలంక అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, డిఆర్‌జి జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో శనివారం మావోయిస్టు ఒకరు చనిపోయిన సంగతి విదితమే.

Spread the love