ఎడ్యుకేషన్ హబ్ డిచ్ పల్లి..

– సీఎంసీలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు భవనం పరిశీలన..
– ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం..
– ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్
నవతెలంగాణ- డిచ్ పల్లి
ఎడ్యుకేషన్ హబ్ డిచ్ పల్లి విరాజిల్లుతుందని,సీఎంసీ లో డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం భావనలను పరిశీలన చేసి మహిళా వసతి గృహం లోనే ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభిస్తామని ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.గురువారం డిచ్ పల్లి మండలానికి మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ గురువారం సీఎంసీ ఆవరణలోని భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బాలికల హాస్టల్ భవనాన్ని ఎంపిక చేశారు.  అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ డిచ్ పల్లి ప్రాంత ప్రజల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ డిగ్రీ విద్య కోసం దూరప్రాంతాలకు విద్యార్థులు వెళ్లకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్య నభ్యసించేందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేశారన్నారు. ప్రజల తరపున సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. డిచ్ పల్లి లో ఒకటవ తరగతి నుండి మొదలు కోని ఉన్నత విద్య కు తెలంగాణ యూనివర్సిటీ, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఉన్నాయని, ఇప్పుడు డిగ్రీ కళాశాల ఏర్పాటుతో డిచ్ పల్లి ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుందన్నారు. డిగ్రీ కళాశాల మంజూరుతో ఈ ప్రాంత ప్రజలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇదే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ కళాశాల తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటు న్నామన్నారు. డిగ్రీ కళాశాల ప్రారంభం కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లను రప్పించేందుకు కృషి చేస్తానన్నారు. నిజామాబాద్ డిగ్రీ కళాశాలల్లో లేని కోర్సులు ఇక్కడ ప్రవేశ పెట్టబోతున్నామని, డిగ్రీ చదువు పూర్తయిన వెంటనే వారికి ఉద్యోగ, ఉపాధి లభించేలా కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ రిక్క లింబాద్రిని కలిసినట్లు తెలిపారు. జాతీయ రహదారి44 కు ఆనుకుని ఉన్న సీఎంసీ ఆవరణలో డిగ్రీ కళాశాల ఏర్పాటు వల్ల విద్యార్థులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుందన్నారు. అడిగిన వెంటనే డిగ్రీ కళాశాల కోసం భవనాన్ని ఐదేళ్ల పాటు ఇవ్వడానికి ముందుకు వచ్చిన సీఎంసీ యాజమాన్యానికి, బోర్డు సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. భవనం మరమ్మత్తుల కోసం అవసరమైన నిధుల మంజూరు కోసం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ను కలిసి మాట్లాడుతానని, ఇదే కాకుండా సిడిపి, ఎస్డిఎఫ్ నుండి సైతం వీధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. మరమ్మత్తులకు ఎంత ఖర్చవుతుందో ఎస్టిమేషన్ తయారు చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎంసీ ప్రాపర్టీబోర్డు సభ్యులు శ్యాంసన్, చర్చి ఫాదర్ ఏసు కుమార్ స్టీఫెన్, దినకర్, ప్రమోద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీ నివాస్ రెడ్డి, నారాయణరెడ్డి, సొసైటీ చైర్మన్ గజవాడ జైపాల్, పార్టీ నాయకులు శక్కరికొండ కృష్ణ, మోహన్ రెడ్డి, ఎంపిటిసి ల ఫోరం అధ్యక్షులు సాయిలు, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ నయీమ్, యూత్ అధ్యక్షులు అమీర్ ఖాన్, నీరడి పద్మారావు, విఠల్ రావు, అంబర్ సింగ్, లింగం యదవ్, మోహమ్మద్ యూసూప్, జగదీశ్ రాథోడ్, ఇర్ఫాన్,ఒడ్డెం నర్సయ్య,సాకలి సాయిలు, సర్పంచులు పాపాయి తిరుపతి, నడ్పన్న కార్యకర్తలు తదితరులున్నారు.
Spread the love