బీఎఎస్‌ఎఫ్‌ నుంచి ఎఫికాన్‌ కీటకనాశిని

హైదరాబాద్‌: ప్రముఖ వ్యవసాయ క్రిమిసంహారకాల కంపెనీ బిఎఎస్‌ఎఫ్‌ కొత్తగా ఎఫికాన్‌ కీటకనాశినిని విడుదల చేసింది. దీనిని సోమవారం హైదరాబాద్‌లో బిఎఎస్‌ఎఫ్‌ అగ్రికల్చర్‌ సొల్యూషన్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రు సిమోన్‌ బర్గ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సిమేన్‌ మాట్లాడుతూ.. గుచ్చి తిను, రసంపీల్చు పురుగులను సమర్థవంతంగా నియంత్రించేందుకు ఎఫికాన్‌ మద్దతునిస్తుందన్నారు. ఎఫికాన్‌ కీటకనాశిని తొలిసారి 2023లో ఆస్ట్రేలియాలో అందుబాటులోకి తెచ్చామన్నారు. రైతులకు మద్దతునివ్వడానికి భూమిపై అతిపెద్ద పని అయిన కీటకాల నుంచి పంటలను రక్షించడం, ఉత్పాదకతను పెంచడమే భారీ సవాలును విజయవంతంగా ఎదుర్కొనేందుకు సహాయపడటానికి తమ నైపుణ్యాన్ని వినియోగిస్తున్నామన్నారు.

Spread the love