మంత్రి కోమటిరెడ్డి దిష్టిబొమ్మ దహనం

– నిరంకుశ వైఖరిపై మంత్రి దిష్టి బొమ్మ దహనం
నవతెలంగాణ – బొమ్మలరామారం
మంత్రి కోమటిరెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకొని, దాడులు సాంప్రదాయాన్ని వీడనాడాలని బొమ్మలరామారం బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పోలగని వెంకటేశ్ గౌడ్ అన్నారు.గూడూరులో సోమవారం భువనగిరి జెడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డిపై కాంగ్రెస్‌ గుండాలు చేసిన దాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కించపరిస్తూ పోలీసులతో బయటకు గెంటించారని వెంటనే క్షమాపణ చెప్పాలని మండిపడ్డారు.యావత్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాక ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు కేసీఆర్ హోందాతనంగా రాజకీయాలు చేశారని,మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాగా నీచ రాజకీయాలు చేయలేదు రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టండి అని అహంకారంతో రైతులను అవమానిచ్చినట్టు మాట్లాడడం కోమటిరెడ్డికి తగదని తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఇలాంటి దాడులు కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని లేనియెడల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టి బుద్ధి చెప్తారని హెచ్చరించారు.రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిరంకుశ వైఖరిపై బొమ్మలరామారం మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ నాయకులుమంత్రి దిష్టి బొమ్మను తగులబెట్టి ఆందోళన చేపట్టారు.రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కాంగ్రెస్ నిరంకుశ వైఖరి మానుకోవాల లేకుంటే ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుధీర్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుశంగల సత్యనారాయణ, సింగల్ విండో చైర్మన్ బాల నరసయ్య, నాయకులు, మచ్చ శ్రీనివాస్ గౌడ్, చంద్రమౌళి,నవీన్ గౌడ్, నరసింహ, ఆంజనేయులు, భరత్, మల్లేశ్, మహేష్, రమేష్, సురేందర్ రెడ్డి, రాజు యాదవ్, తదితరు నాయకులు పాల్గొన్నారు.

Spread the love