Homeతెలంగాణ రౌండప్24న ఈజీఎస్ సామాజిక తనిఖీ, ప్రజావేదిక

24న ఈజీఎస్ సామాజిక తనిఖీ, ప్రజావేదిక

- Advertisement -

నవతెలంగాణ – పరకాల : హనుమకొండ జిల్లా పరకాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈనెల 24వ తేదీన మంగళవారం గ్రామీణ ఉపాధి హామీ పథకం 16వ విడత సామాజిక తనిఖీ, ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు తెలిపారు. మండలంలోని 10 గ్రామ పంచాయతీలలో చేపట్టిన పనులు, ప్రగతి నివేదికలు, పనుల్లో పాల్గొన్న కార్మికుల సంఖ్య, చెల్లించిన నగదు, ఇతర అంశాలపై సామాజిక తనిఖీ ప్రజా వేదికలో చర్చించనున్నట్లు ఎంపిడిఓ తెలిపారు. ప్రజలు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజా వేదిక కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రకటనలో పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -