నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం నీల జిల్లా పరిషత్ పాఠశాలలోని పోలింగ్ బూత్ కేంద్రాలను ఎన్నికల వ్యయ పరిశీలకు రాలు తానియా సింగ్ సందర్శించారు. పోలింగ్ కేంద్రాలలోని సౌకర్యాలను ఆమె పరిశీలించారు. శాంతియుత వాతావరణం లో ఎన్నికలు జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. వెంట సిబ్బంది తోపాటు, ఎస్సై ఉదయ్ కుమార్, తమ కార్యదర్శి బి. రాణి, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.