అభివృద్ధి బాటలో మారుమూల గ్రామాలు

– ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి
నవతెలంగాణ-ఆళ్ళపల్లి : రాష్ట్రంలో మారుమూల ఏజెన్సీ గ్రామాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలోనే అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తున్నాయని ఆళ్ళపల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, ఉమ్మడి గుండాల మండలం పీఏసీఎస్ ఛైర్మన్ గొగ్గెల రామయ్య పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆళ్ళపల్లి మండల పరిధిలోని మారుమూల ఏజెన్సీ గ్రామ పంచాయతీ అయిన దొంగతోగు గ్రామానికి స్థానిక బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, శ్రేణులతో కలిసి ఎంపీపీ, పీఏసీఎస్ ఛైర్మన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో దొంగతోగు గ్రామంలో సీసీ రోడ్డు, ప్రధాన చెరువుకు మరమ్మతులు, మిషన్ భగీరథ నీళ్ళు అందిచడం, త్రీఫేస్ కరెంట్ సౌకర్యం కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. బారాస ప్రభుత్వం ఇచ్చిన ట్రైకార్ లోన్లు, కల్యాణ లక్ష్మి, పింఛన్లు, తదితర వాటిని ప్రజలకు గుర్తు చేసి, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మరిన్ని సంక్షేమ పథకాలు దొంగతోగు గ్రామంలో మరింత మందికి చేరువవుతాయని తెలిపారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బారాస ప్రభుత్వం ఏర్పడ్డాక దొంగతోగు గ్రామానికి ప్రధాన రహదారి సమస్యను తీరుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దొంగతోగు సర్పంచ్ ఉప సర్పంచ్ బాయమ్మ, పాపారావు, శంకర్ బాబు, బారాస నాయకులు షేక్ బాబా, కిశోర్ బాబు, ప్రవీణ్, ఖయ్యుం, కృష్ణ, ఆరిఫ్, సాంబశివరావు, సతీష్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
Spread the love