95 మందితో కార్యవర్గం
అధ్యక్షులుగా జి.నాగయ్య, ప్రధాన కార్యదర్శిగా ఆర్.వెంకట్రాములు
శాశ్వత ఆహ్వానితులుగా తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ గ్రౌండ్‌లో మూడ్రోరోజులపాటు జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా చివరి రోజు సోమవారం రాష్ట్ర నూతన కమిటీని మహాసభ ఎన్నుకుంది. మొత్తం రాష్ట్ర కమిటీలో 95 మందిని తీసుకోగా అందులో నుంచి కార్యవర్గంగా 31 మందిని ఎన్నుకున్నారు. ఇద్దరిని కోఆప్షన్‌గా ఎన్నుకున్నారు. శాశ్వత ఆహ్వానితులుగా తమ్మినేని వీరభద్రం ఉండనున్నారు. అధ్యక్షులుగా జి.నాగయ్య, ప్రధాన కార్యదర్శిగా ఆర్.వెంకట్‌రాములు, ఉపాధ్యక్షులుగా జాన్‌వెస్లీ, బి.ప్రసాద్, కనకయ్య, పొన్నం వెంకటేశ్వర్లు, సైదులు, అంజయ్య, ఎం.ఆంజనేయులు, నర్సింహులు, పీవీ, రాఘవులు, సాంబశివ, శ్రీనివాసులు ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా బి.పద్మ, ఆర్.శ్రీను, ఎర్ర శ్రీను, ఎం.రాములు, అయిలయ్య, పెంటయ్య, కె.జగన్, ఎం.వెంకటయ్య, గోపాల్, శశి, సింగారపు రమేష్, సమ్మయ్య, వీరయ్యను ఎన్నుకున్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



