నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి 

– నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద రాస్తారోకో

– సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ- కంటేశ్వర్ 
నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని, నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులు, సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహిస్తూ సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ జిల్లాలో సీఐటీయూ ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ యూనియన్ జిల్లా అధ్యక్షులు షాదుల్లా లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు శాఖల్లో ప్రభుత్వం రెగ్యులర్ చేసిందని అన్ని శాఖల కన్నా ఎక్కువగా కష్టపడి ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న ఎన్.హెచ్.ఎం.ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులర్ చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమైతే అన్ని రకాల వైద్య సేవలు అందించి ప్రజా ప్రాణాలను కాపాడిన ఘనత నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులదైనా అని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో షాదుల్లా మురళి లక్ష్మణ్ గంగాధర్ రవి గౌడ్ వందన మానస ఝాన్సీ శ్యామల సోమశేఖర్ సత్యనారాయణ శ్యామ్, సంధ్య ఉసేన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love