– ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ రాజ్ కుమార్
నవతెలంగాణ – ధర్మారం
మండల కేంద్రంలోని ఆదర్శ కళాశాలకు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎనిమిది మంది విద్యార్ధులు తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్షా ఆదేశాల మేరకు వృత్తి విధ్య లో భాగంగా ఈ దసరా సెలవులను 10 రోజులు విద్య కోర్సు ఇంటర్న్ షిప్ ద్వారా నేర్చుకోని విద్యార్థులు ఉపాధి అవకాశాలు పొందాలని ఆదర్శ కళాశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజకుమార్ అన్నారు. అందులో భాగంగా వృత్తి విద్య, వ్యాయామ విద్య విద్యార్థులు స్థానిక దిలీప్ ఫిజియోథెరపీ క్లినిక్ లో శిక్షణ తీసుకుంటూ చికిత్స కూడా ఇస్తున్నారు. అలాగే అప్పారెల్ విద్యార్థులు స్థానిక సుమ బోటిక్ సెంటర్ లో ఫ్రాక్, చీరలు, మెటీరియల్, కుట్లూ,అల్లికలు, మగ్గం వర్క్, లో శిక్షణ తీసుకుంటున్నారని, ఆదర్శ పాఠశాల కళాశాల లో సాధారణ విధ్యతో పాటు,వృత్తి విద్యా శిక్షణ ల ద్వారా తెలంగాణ వొకేషనల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారని తద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను పొందుతారని మంచి అవకాశం అని ప్రిన్సిపాల్ ఈరవేని రాజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమం లో వృతివిద్య అధ్యాపకులు మేకల సంజీవరావు, సి ఎచ్ దీపిక, పృథ్విద్యాన్ని పనులు తదితరులు పాల్గొన్నారు.