సీఎంకు, మంత్రి శ్రీధర్‌బాబుకు
కేటీఆర్ చురకలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుల భూ కుంభకోణాలపైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఎక్స్ ద్వారా స్పందించారు. రూ.లక్ష పెట్టుబడితో రూ.వందల కోట్ల విలువైన భూములు కొట్టేసే మార్గం తెలంగాణ బిడ్డలకు కూడా చెప్పండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుకు చురకలు అంటించారు.
నిజమైన స్టార్టప్‌లు ఎదగాలనీ, నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కాలని తాము కష్టపడి ‘టీ-హబ్ నిర్మిస్తే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కుటుంబ ప్రయోజనాల కోసం “ఎనుముల హబ్స్” ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇది ఫ్యామిలీ-రన్ ఫ్యామిలీ-డ్రైవ్ స్కామ్ అని విమర్శించారు. ఇందులో జీరో ఇన్నోవేషన్ జీరో ఎంప్లాయీస్ అని తెలిపారు. కానీ రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు మాత్రం కారుచౌకగా కేటాయింపు చేశారని పేర్కొన్నారు. ఎనుముల సోదరుల్లో ఒకరైతే చాలు ఎటువంటి ప్రశ్నలు లేకుండా భూములు దక్కించుకోవచ్చని వివరించారు. రూ.లక్ష పెయిడ్-అప్ క్యాపిటల్‌తో, ఒక్క ఉద్యోగి కూడా లేని టెస్పరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రయివేటు లిమిటెడ్ అనే డిఫెన్స్ కంపెనీ పెట్టి, రాత్రికి రాత్రే కనీసం ₹200 కోట్ల లాభం/ఆస్తి ఆర్జించిన “ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ”గా ఎనుముల కొండల్ రెడ్డిని ప్రకటించాల్సిందేనని తెలిపారు. శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు కూడా ఈ అద్భుతమైన “బిజినెస్ మోడల్” ఏంటో నేర్పించాలని కోరారు. రూ.వందల కోట్ల ప్రభుత్వ భూమిని ఇంత చౌకగా ఎలా పొందాలో శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఈ మ్యాజిక్ ట్రిక్ కేవలం ఎనుముల కుటుంబానికే ఎందుకు పరిమితం కావాలని ప్రశ్నించారు. తెలంగాణ యువత మొత్తానికి ఈ “ఎనుముల హబ్” అవకాశాన్ని కల్పించాలని పేర్కొన్నారు.
ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీగా ఎనుముల కొండల్‌రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



