బాల భవన్ విద్యార్ధుల ఆధ్వర్యంలో పర్యావరణంపై అవగాహన ర్యాలీ..

నవతెలంగాణ-సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కెంద్రం లోని జవహర్ బాల భవన్ ఆధ్వర్యంలో ఆదివారం వేసవి శిక్షణ శిబిరం లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 ను పురస్కరించుకుని అవగాహన ర్యాలీ నిర్వహించారు, ముఖ్య అతిథిగా హాజరైన గ్రీన్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ముప్పారాపు నరేందర్ ,అభివృద్ధి కమిటీ సభ్యులు విశ్రాంత అధ్యాపకుడు హమీద్ ఖాన్ లు మాట్లాడుతూ చేతి సంచి వాడకం పెంచి ప్లాస్టిక్ నివారణ కోసం కృషి చేయాలని,చెట్లు నాటి నీళ్ళు పోసి సంరక్షణ చేపట్టడం అందరి బాధ్యత అని,అన్ని పొల్యూషన్ ల నుండి ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించాలి అని అన్నారు.తదనంతరం బాల్ భవన్ నందు గ్రీన్ డ్రెస్ లో స్టూడెంట్స్ పేరెంట్స్ తో ఏర్పాటు చేసిన ర్యాలీ నీ ఆకుపచ్చని జండా ఊపి ప్రారంభించారు.జూనియర్ కాలేజి మీదుగా కల్నల్ సంతోష్ చౌరస్తా కు చేరుకుని దేశం హద్దుల్ని కాపాడే బాధ్యత సైనికులది, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మన అందరిది అని నినాదాలు చేశారు, పరిరక్షించేందుకు సిద్ధం అంటూ ప్లెడ్జ్ చేశారు.ఈ కార్యక్రమంలో బాల్ భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ రెడ్డి, సిబ్బంది ఎల్లయ్య, సింగ్, ఉమా, అనిల్, సాయి, వీరయ్య, పద్మ,సునీత, స్టూడెంట్స్, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love