నవతెలంగాణ-హైదరాబాద్ : యంగ్ హీరో శర్వానంద్ హైదరాబాద్ ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద రోడ్డ ప్రమాదానికి గురైనట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న రేంజ్ రోవర్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టడంతో.. ఆయనకు స్వల్ప గాయాలు అయినట్లుగా వస్తున్న వార్తలపై తాజాగా శర్వానంద్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. రోడ్డు ప్రమాదం జరిగింది నిజమే కానీ.. అది చాలా చిన్న సంఘటనగా ఆయన చెప్పుకొచ్చారు. తనకేం కాలేదని.. అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని శర్వానంద్ తెలియజేశారు. ‘ఈ ఉదయం నా కారు ప్రమాదానికి గురైనట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇది చాలా చిన్న సంఘటన. మీ అందరి ప్రేమ ఆశీస్సులతో.. నేను ఇంట్లో సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నాను. దీనిపై ఎవరూ ఆందోళన చెందవద్దు. నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న అందరికీ ధన్యవాదాలు. అందరికీ ఈ ఆదివారం గొప్పగా ఉండాలని భావిస్తున్నాను’ అని శర్వానంద్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.