జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ సెంటర్

నవతెలంగాణ – కంటేశ్వర్
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ సెంటర్,కంటి కాటరాక్ట్ ఆపరేషన్ లేజర్ మెషిన్,మానసిక వికలాంగుల ప్రత్యేక విభాగం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఎమ్మేల్యే గణేష్ గుప్తా,జెడ్పీ ఛైర్మెన్ విఠల్ రావు,ఉమెన్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ చైర్ పర్సన్ ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ దవాఖానాలను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం.ప్రభుత్వ ఆసుపత్రిలో ఖరీదైన సిటీ స్కానింగ్ ను ప్రారంభించడం సంతోషకరం.14 లక్షల వ్యయంతో కాట్రాక్ కంటి మిషన్లు కూడా ప్రారంభించాము.. మానసిక వికలాంగుల చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించాం.మానవీయ కోణంలో ఏర్పాటు చేసిన మానసిక వికలాంగుల విభాగం 24 గంటలు అందుబాటులో ఉంటుంది.నాలుగు లక్షల ల డిజిటల్ బిపి మిషన్ లను జిల్లాలోని అన్ని పీహెచ్ సి లకు పంపిణీ చేసాం. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా నిరుపేదలకు అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలియజేశారు.

Spread the love