రామ్-బోయపాటి ఫస్ట్ తండర్ బీభత్సం..

నవతెలంగాణ-హైదరాబాద్ : టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పై ఆడియన్స్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రిలీజ్ పోస్టర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ తండర్ పేరు మీద ఓ వీడియో రిలీజ్ చేశారు. నేడు (మే 15) పుట్టినరోజు కావడంతో మూవీ నుంచి పవర్ ఫుల్ వీడియోను విడుదల చేసి రామ్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చారు. ఇక ఈ సినిమా కోసం రామ్ కొంచెం లావు అయ్యినట్లు కనిపిస్తుంది. వీడియో మొత్తాన్ని యాక్షన్ సీక్వెన్స్ తో నింపేసాడు బోయపాటి. రామ్ చెప్పిన మాస్ డైలాగ్.. ‘నీ స్టేట్ దాటలేనన్నావ్ దాటా. నీ గేట్ దాటలేనన్నావ్ దాటా. నీ పవర్ దాటలేనన్నావ్ దాటా. ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్’ అదిరిపోయింది. కాగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయడానికి కొంత సమయం పడుతుందని ఇటీవల చిత్ర నిర్మాత చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాసా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Spread the love