ఇథనాల్ నిల్వ గోడౌన్ నిర్మాణ అనుమతులు రద్దు చేయాలి

– తహసీల్దార్ కు వినతిపత్రమందజేసిన నర్సింహులపల్లి గ్రామస్తులు
నవతెలంగాణ – బెజ్జంకి 
పోతారం గ్రామ పంచాయతీ పాలకవర్గం ఇథనాల్ నిల్వ గోడౌన్ నిర్మాణానికి తీర్మాణం చేయడాన్ని నిరసిస్తూ ఇథనాల్ గోడౌన్ నిర్మాణ అనుమతులను ప్రభుత్వం బేషరుతుగా రద్దు చేయాలని నర్సింహులపల్లి గ్రామస్తులు అక్రోశం వెళ్లగక్కారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ వద్ద పోతారం శివారులో ఇథనాల్ నిల్వ చేసే గోడౌన్ నిర్మాణ అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలని, పలువురు నర్సింహులపల్లి గ్రామస్తులు తహసిల్దార్ ఎర్రోల్ల శ్యామ్ కు వినతిపత్రమందజేశారు.
Spread the love