నవతెలంగాణ-సదాశివపేట
ఆరోగ్యం బాగాలేకున్నా నిత్యం ప్రజా సేవలోనే ఉన్నా అని.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తనను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండల పరిధిలోని సూరారం, తంగడపల్లి, తంగ డపల్లి తాండాల్లో శనివారం సాయంత్రం ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేం డ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయల ేదన్నారు. తనకు ఆరోగ్యం బాగాలేకున్నా నిత్యం ప్రజా సేవలో ఉండి.. ఏ క్షణం ఫోన్ చేసినా ప్రజలకు అందుబా టులో ఉన్నాన్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మెన్ కాసాల బుచ్చిరెడ్డి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీహరి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఆత్మకూరు నాగేష్, మండలాధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు, సూరారం సర్పంచ్ రజియా బేగం, సలావుద్దీన్, తంగడపల్లి సర్పంచ్ సిద్ధన్న తదితరులు పాల్గొన్నారు.