రైతులు ప్రతి ఒక్కరు భూసార పరీక్షలు చేయించుకోవాలి

– క్రిభ్కో ఎరువుల సంస్థ ఏరియా మేనేజర్ శ్రీనివాస్ రావు
నవతెలంగాణ కమ్మర్ పల్లి:  రైతులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని క్రిభ్కో ఎరువుల సంస్థ ఏరియా మేనేజర్ శ్రీనివాస రావు అన్నారు. సోమవారం మండలంలోని ఉప్లూర్ రైతు వేదిక వద్ద క్రిభ్కో ఎరువుల సంస్థ ఏరియా మేనేజర్ శ్రీనివాస రావు, జిల్లా సేల్స్ అధికారి లక్ష్మి నారాయణ రెడ్డి రైతులకు ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ అవగాహన సదస్సులో రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారి రమేష్ భూసార పరీక్షల కొరకు మట్టి నమూనా సేకరణ విధానం గురించి వివరించారు.
అనంతరం సామాజిక సేవలు, పరిశుభ్రత పరిరక్షణ కొరకు రైతులకు ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. క్రిభ్కో కంపెనీ తరపున శానిటేషన్ కాంపెయిన్ లో భాగంగా గ్రామ స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాల కొరకు డస్ట్ బిన్ లు, బ్లీచింగ్ పౌడర్ అందించారు. సింగల్ విండో గోదాం కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా క్రిబ్ కో కంపెనీ ప్రతినిధులకు కమ్మర్ పల్లి సహకార సంఘం తరపున చైర్మన్ రేగుంట దేవేందర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘ అధ్యక్షులు రేగుంట దేవేందర్, ఎంపీటీసీ సభ్యుడు పిప్పెర అనిల్, విండో పరిధిలోని డైరెక్టర్లు, విండో కార్యదర్శి శంకర్, సిబ్బంది, గ్రామ పెద్దలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love