ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి…

– విధులు నిర్వహించే సిబ్బందికి సూచన..
– లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దులో 06 చెక్ పోస్ట్ లు ఏర్పాటు
– చెక్ పోస్ట్ ల వద్ద 24/7 పకడ్బందీగా తనిఖీలు 
– జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
జిల్లా సరిహద్దులు ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ ల వద్ద జిల్లాకు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వర్తించే సిబ్బందికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా సరిహద్దు అయిన జిల్లేళ్ల చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహత్యం మంగళవారం తనిఖీ చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దులో 06 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మద్యం,డబ్బు ఇతర అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలపలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.తంగలపల్లి పోలీస్ స్టేషన్ పరిధి జిల్లెళ్ల,గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ పరిధి పెద్దమ్మ స్టేజి వద్ద,ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి వెంకట్రావ్ పల్లి,వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి  ఫజుల్ నగర్,బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కొదురూపాక,రుద్రాంగి పోలీస్ స్టేషన్ పరిధి మనాల క్రాస్ రోడ్ వద్ద చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఆదేశించారు.ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎన్నికల నిబందనలు పాటించాలని సూచించారు.తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా 50 వేల కంటే ఎక్కువ అమౌంట్ తీసుకువెళ్లినట్లయితే సీజ్ చేయడం జరుగుతుందని వెల్లడించారు.

Spread the love