అందరికీ తెలిసిన అక్క.. అన్యాయంపై గెలుపే సీతక్క

నవతెలంగాణ-గోవిందరావుపేట: మంత్రిపైనే విజయం సాధించిన అక్కకు ఇదో లెక్కా వలస నాయకుల ఎత్తులు చిత్తులవుతున్న క్రమం అక్క గెలుపును ఆపడం ముక్కు మంత్రి వల్ల  కాదుమండలంలో రెండవ విడత ప్రచారంలో ఎమ్మెల్యే సీతక్క. అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ తేదీ సమీపిస్తున్న క్రమంలో రాజకీయాలు అమాంతం వేడెక్కుతున్నాయి. మండలంలో ఎమ్మెల్యే సీతక్క శనివారం పలు గ్రామాలలో విస్తృతంగా పర్యటన ప్రచారం నిర్వహించారు. ములుగు నియోజకవర్గము నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా రెండవసారి పోటీపడుతున్న ఎమ్మెల్యే సీతక్క గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతోంది. వాస్తవంగా సీతక్క పేరు తెలియని వాళ్ళు ఉండరు. స్కూలు పిల్లగాని కానుంచి అమెరికా అగ్రరాజ్యాల వరకు వరల్డ్ బుక్ ఆఫ్ మ్యాగజన్లో చోటు ఫోటో సంపాదించిన ఘనత సీతక్కకి దక్కుతుంది. కరొన సమయంలో ఆమె అందించిన సేవలకు వరల్డ్ బుక్ ఆఫ్ మ్యాగజైన్లో చోటు లభించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీమంత్రి చందూలాలు పై 23 వేల ఓట్లపై చిలుకు తో విజయం సాధించిన సీతక్క ఈసారి సాధారణ అభ్యర్థిపై 50 వేల పైచిలుకు మెజారిటీ సాధించాలన్నది లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ హవా తగ్గకపోగా ప్రభంజనం వీచింది అంతటి ప్రపంచం లోనే అనూహ్యమైన మెజారిటీతో విజయం సాధించిన సీతక్క ఈసారి రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేక ప్రజా పవనాలు వీస్తున్న తరుణంలో మెజారిటీ రికార్డ్ స్థాయిలో ఉండాలన్నదే లక్ష్యంగా పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రికార్డు మెజారిటీతో ఉన్న అక్కకు బెస్ట్ పోర్ట్ పోలియో వస్తుంది ఆదశ లో సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ లను తలదన్నే విధంగా ములుగు జిల్లా అభివృద్ధి కావడం ఖాయం అంటుంది సీతక్క..
దిగుమతి నాయకుల ఎత్తులను చిత్తు చేస్తున్న కాంగ్రెస్.
ములుగు నియోజకవర్గ వ్యాప్తంగా దిగుమతి నాయకులు చేస్తున్న కుటిల ప్రయత్నాలను ఎక్కడికక్కడ కాంగ్రెస్ వర్గాలు తిప్పికొడుతున్నాయి. నాయకులు దొంగచాటుగా పంపిణీకి సిద్ధం చేసిన క్రీడా కిట్లను కుట్టు మిషన్లను ఇప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏ గ్రామంలో చీమ చీటుక్కుమన్న కాంగ్రెస్ శ్రేణులు అదే తీరులో స్పందిస్తున్నారు. ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా కాంగ్రెస్ సైనికులు ఇతర పార్టీ నాయకుల ప్రలోభాలను తాఇలాలను కుటిల ప్రయత్నాలను తుత్తునియ్యలు చేస్తూ వీరోచతంగా ముందుకు సాగుతున్నారు.
వలస నాయకులు ఎన్నికల వరకే పరిమితం
ఎన్నికలు లక్ష్యంగా ములుగు నియోజకవర్గానికి వలస వచ్చిన నాయకులు ఎన్నికల వరకే పరిమితం అవుతారని ఆ తర్వాత ఎవరు కంటికి కనబడరని సీతక్క అన్నారు. ఈ గ్రామంలో ఎక్కడ ఆపద వచ్చిన ఉప్పెన వచ్చిన ఉపద్రవం వచ్చిన పిలిచినా పిలువకపోయినా వెంటనే వచ్చి మీ ముందుండేది సీతక్క మాత్రమేనని అన్నారు. కరోనా సమయంలో ఈ వర్షాకాలం వరదల సమయంలో ఈ వలస నాయకులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకొని వారికి ఇప్పుడు ఏ అర్హతతో వస్తున్నారు ప్రజలే అర్థం చేసుకోవాలని సూచించారు.
ఇప్పటికే వలస నాయకుల ఎత్తులు చిత్తవుతున్నాయని ఇకముందు కూడా వలస నాయకుల ఆటలు సాగవని అన్నారు. దిగుమతి నాయకులు ఓట్ల తెల్లారి ఎగుమతి అయిపోతారని మళ్లీ ప్రజల వద్ద సీతక్కే ఉంటుంది. బీఆర్ఎస్ లకు నామకరణానికి పెళ్లికి పేరంటానికి చావుకు తద్దినానికి  ఏ నాయకుడు రాడని సీతక్క మాత్రం ఎక్కడ ఏ కార్యం జరిగిన తను హాజరై ఆ కుటుంబ సభ్యులను స్థానిక ప్రజలను పరామర్శించి క్షేమ సమాచారం తెలుసుకొని అవసరాలను రాసుకొని పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తుందని ప్రజలు అంటున్నారు. వలస నాయకులు పారిపోక తప్పదని రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఏటూర్ నాగారంలో గత కొంతకాలం నుంచి తీష్ట వేసిన వ్యక్తి హైదరాబాద్ తన సొంత గుటికి పరిగెత్తుతాడని అన్నారు. సమస్యలన్నింటినీ కాలమే పరిష్కరిస్తుందని ప్రజలు మాత్రం విజయాన్ని అందిస్తారని అన్నారు.
Spread the love