నవతెలంగాణ – డిచ్ పల్లి
రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పి.ఓ.డబ్ల్యూ, పి.డి.ఎస్.యు, పివైఎల్ ఆధ్వర్యంలో డిచ్ పల్లి మండల కేంద్రంలో క్రీడా పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా పి.ఓ.డబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కే.సంధ్య, పి. డి.యస్.యు, పి.వై.ఎల్. జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కే అషుర్, సాయిబాబా లు, మాట్లాడుతూ, మానసిక ఉల్లాసానికి, రోజువారి పనులతో సతమతమవుతున్న మహిళలకు యువతకి క్రీడా పోటీల ద్వారా తమ ప్రగతిశీల ఆలోచనలతో, శారీరకంగా కూడా ఎదుగుతూ ఉంటారని అన్నారు. ఒక ఉల్లాస వాతావరణాన్ని, ప్రజలందరము సమానులే అనే భావానాన్ని చాటడానికి ఇది ఒక మంచి వాతావరణం అని కొనియాడారు. అదేవిధంగా ఈరోజు యువత, ప్రజలు ఫోన్లు ,ఆన్లైన్లో లాంటి వాటికి ఆకర్షితులై ఉన్న తరుణంలో క్రీడల ద్వారా వాళ్లలో ఉన్న ప్రగతిశీల భావజాలాన్ని పెంపొందించే విధంగా ఉండటం ముందుకు వెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు.అనంతరం క్రీడలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అలాగే పాల్గొన్న ప్రతి అభ్యర్థికి బహుమతులు అందజేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రగతిశీల శక్తులుగా మానసికంగా, శారీరకంగా ఎదగడానికి తోడ్పడే క్రీడల పోటీలను జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా పార్టీ మండల కార్యదర్శి మురళి, వాసరి మోహన్, పి.ఓ.డబ్లు. జిల్లా సహాయ కార్యదర్శి గౌర, లలిత శకుంతల , బాలమణి, రజిత, సమీన, శారద తదితరులు పాల్గొన్నారు.