అంతా మనవాళ్లే..ఎలాగైన పాసవచ్చు..!

– పది పరీక్షలపై విద్యార్థులకు బోధన సిబ్బంది భరోసా..? 

– మండలంలో ఉపాధ్యాయుల తీరుపై పలువురి అరహనం
– ఈ నెల 18 నుండి పది పరీక్షలు..
నవతెలంగాణ – బెజ్జంకి
అంత మనవాళ్లే..ఎలాగైన పాసవచ్చు.మండలంలోని అయా పాఠశాలల్లోని బోధన సిబ్బంది పదవ తరగతి విద్యార్థులకు భరోసా ఇచ్చినట్టు సమాచారం. బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్న బోధన సిబ్బంది తీరుపై కొందరు అసహనం వెల్లగక్కుతుంటే మరికొందరు పర్వాలేదంటున్నారు. ఈ నెల 18 నుండి పది పరీక్షలు ప్రారంభమవ్వనున్నాయి. కేంద్రాల్లో పరీక్షల నిర్వహకులుగా మండలంలోని ఉపాధ్యాయులే విధులు నిర్వర్తిస్తుండడంతో సహాయ సహకారాలు మెండుగా అందిస్తారనే ప్రచారం ఎన్నో ఎళ్లుగా సాగుతూనే ఉంది. దీంతో ప్రతిభ ఉన్న విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొంత అలజడి మొదలైంది. సిబ్బంది ఐచ్చిక పాఠ్యాంశాలను క్షుణ్ణంగా బోధించకుండా విద్యార్థులు మాల్ ప్రాక్టిస్ కు పాల్పడేలా ప్రోత్సహించడంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. క్రమశిక్షణతో తీర్చిదిద్ది ఉన్నతమైన భవిష్యత్తుకు పునాదులు వేయాల్సిన బోధన సిబ్బంది విద్యార్థులను మాల్ ప్రాక్టిస్ కు పాల్పడేల ప్రోత్సాహించడమేంటని పలువురు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మండలంలో ఏర్పాటుచేసిన పది పరీక్షల కేంద్రాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి మాల్ ప్రాక్టిస్ ను ప్రోత్సాహించే ఉపాధ్యాయులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు. మండలంలో 10 జిల్లా పరిషత్,కే జీవీబీ, ఆదర్శ, సాంఘీక సంక్షేమ గురుకుల,07 ప్రయివేట్ విద్యాలయాలున్నాయి. ఈ యేడాది ప్రభుత్వ పాఠశాల నుండి 223, ప్రయివేట్ పాఠశాలల నుండి 338 మంది(561)విద్యార్థులు పది పరీక్షలకు హజరవుతున్నారు. మండల కేంద్రంలోని బాలికల,బాలుర ప్రభుత్వోన్నత పాఠశాలల్లో ప్రభుత్వం పది పరీక్షల కేంద్రాలను ఏర్పాటుచేసింది. మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు హుస్నాబాద్,రేగులపల్లి ప్రభుత్వోన్నత, ప్రయివేట్ పాఠశాల విద్యార్థులు కోహెడ మండలంలోని శనిగరం ప్రభుత్వోన్నత పాఠశాలల్లో ఏర్పాటుచేసిన కేంద్రంలో పరీక్షలకు హజరవ్వనున్నారు. ప్రభుత్వోన్నత 09,కేజీవీబీ, ఆదర్శ,06 ప్రయివేట్ పాఠశాలల విద్యార్థులు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రాల్లో పరీక్షలకు హజరవ్వనున్నారు.
విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపం: మండలంలోని అయా ప్రభుత్వోన్నత పాఠశాలల్లోని బోధన సిబ్బంది పాఠ్యాంశాల బోధనను పూర్తి చేశారు. పూర్తి చేసిన పాఠ్యాంశాలపై బోధన సిబ్బంది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు  నిర్వహిస్తున్నారు. పరీక్షల సమయం దగ్గరపడుతుండడంతో కొందరు విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొంత భయానక వాతవరణం నెలకొంది.విద్యార్థులకు క్రమశిక్షణను అలవర్చి స్వతహాగా మనోదైర్యంతో పరీక్షలకు హజరయ్యేల తీర్చిదిద్దాలని బోధన సిబ్బందిని పలువురు విన్నవిస్తున్నారు.
జిల్లాంతట ఇదే తంతు: పది పరీక్షల పలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా ఉత్తమ పలితాలు సాధించాలనే అక్కసుతోనే విద్యాశాఖ అధికారులు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడేల ప్రోత్సాహిస్తున్నారని ప్రజల్లో నాటుకుపోయింది.దీనికి తోడు ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యం తమ విద్యార్థులను చూసిచూడనట్టు వ్యవహరిస్తే సంబంధిత అధికారులకు,పరీక్షల కేంద్రాల్లోని సిబ్బందికి కొంత నజరానా అందజేస్తున్నట్టు వినికిడి.దీంతో ప్రయివేట్ పాఠశాలల విద్యార్థులు సాధించిన ఉత్తమ ఉత్తీర్ణత పలితాలను యాజమాన్యం ప్రచారస్త్రాంగా మలుచుకుని అధిక సంఖ్యలో ప్రవేశాలు జరుపుకోవడం,ఫీజుల రూపంలో అందినకాడికి దండుకుంటున్నారనేది సత్యం.ఈ తతంగమంత సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారుల కనుసన్నుల్లోనే జరుగుతున్న చూసిచూడనట్టు వ్యవహరించడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి.ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు ఎలాంటి అవకతవకలకు అస్కారం ఇవ్వకుండా పకడ్భందీగా పది పరీక్షలు నిర్వహిస్తే ప్రతిభ ఉన్న విద్యార్థులతో పాటు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
బాధ్యతరహితంగా వ్యవహరిస్తే చర్యలు: పది పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ అధేశానుసారం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తాం.మాల్ ప్రాక్టిస్ పాల్పడిన విద్యార్థులపై..మాల్ ప్రాక్టిస్ కు ప్రోత్సాహించిన సిబ్బందిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు.పది పరీక్షలకు విద్యార్థులు మనో దైర్యంతో హజరవ్వాలి. పరీక్షల నిర్వహణపై నేడు సమీక్ష సమావేశం ఏర్పాటుచేసాను.సమావేశంలో పరీక్ష కేంద్రాల్లో సిబ్బంది వ్యవహరించే తీరు,నిబంధనలపై అవగాహన కల్పిస్తాం. పావని,ఎంఈఓ బెజ్జంకి.
Spread the love