అంతా అభివృద్ధేనా! అలజడులు లేవా?

Everything is development! No worries?ఇటీవలకాలంలో కేంద్ర ప్రభుత్వం మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, త్వరలో ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవ స్థగా రూపాంతరం చెందుతుందని చెబుతూ మూడోసారి అధికారం చేపట్టాలనే ఆలోచనతో ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా ఢిల్లీలో జరి గిన బీజేపీ జాతీయ సమావేశాల్లో ప్రధాని ఏ కంగా 25 కోట్లమంది ప్రజలను పేదరికం నుం చి బయట పడేశామని తెలిపారు. ఇది వాస్తవ మేనా..!? అయితే ఉచిత, సంక్షేమ పథకాలు ఎందుకు పెంచుతున్నారో ఏలుతున్న వారే చెప్పాలి.
రైతుల ఉద్యమంతో దేశ రాజధాని దద్దరి ల్లుతోంది. మరోవైపు ఉద్యోగ, కార్మికులు నిరస నలు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అధిక ధరలు, హద్దు అదుపు లేకుండా పెరుగుతున్నాయి. ఉ పాధి లేక అనేక మంది విదేశీ బాట పడుతు న్నారు. యువత, విద్యార్థులు, పారిశ్రామిక వేత్త లు వలసలు వెళుతున్నారు. దేశంలో కుల, మత, జాతి, లింగ వివక్షతలు పెరుగుతున్నా యి. దానికి తాజా ఉదాహరణ గత పది నెల లుగా మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లు. బడ్జె ట్‌లో ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రా లకు అన్యాయం జరుగుతుందని అనేక మంది గళమెత్తుతున్నారు. కానీ దేశంలో ఒక మతాన్నే భుజాన్ని వేసుకుని వెళుతున్న పరిస్థితి. తినే తిండి, కట్టుకునే దుస్తుల మీద ఆంక్షలు. రా జ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన చేస్తున్నా రని తరచూ న్యాయస్థానాల్లో వాజ్యయాలు… మహిళలు బాలికలపై అఘాయిత్యాలు రోజురో జుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. ఇక కేంద్ర ప్రభు త్వంచే నియమించబడిన గవర్నర్లుల్లో చాలా మంది బీజేపీయేతర రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రా లను ఇబ్బంది పెడుతున్నారు… తాజాగా కేరళ, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలు నిరసనలు. ఇక వివిధ విశ్వవిద్యాలయాల్లో గవర్నర్లు ఛాన్సలర్‌ గా విచిత్ర ధోరణులు పురికొల్పడంతో విద్యార్థు లు నిరసనలు చేస్తున్నారు. దేశ సంపద కొం దరి చేతుల్లో పెట్టే విధానాలు, కార్పోరేట్‌ వ్యక్తు లకు బడా పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేయ డంపై ప్రజలు గరంగానే ఉంటున్నారు. ఇంకా పేదలకు విద్యా వైద్య సేవలు అందని ద్రాక్ష గానే ఉన్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు రికార్డు స్థాయిలో రాణించడం దేశం అభివృద్ధి చెందు తున్నది డంకా బాజయిస్తున్నారు. వాస్తవానికి ప్రజల తమ కనీస అవసరాలు తీర్చుకోవడానికి కనీస వేతనాలు అందటం లేదు. పోషకాహార లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య మరింత పెరిగింది. నైపుణ్యాలు లేమితో యువత బాధ పడుతున్న మాట వాస్తవం. రైతులు, విద్యార్థు లు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వ్యవసా య, పారిశ్రామిక రంగాలు అనుకున్నంత స్థా యిలో రాణించడం లేదు. కనీస మద్దతు ధర చట్ట రూపం ధరించలేదు. కౌలు రైతులకు భరోసా లేదు.
దేశీయ అంతర్జాతీయ స్థాయిలో వివిధ సంస్థలు మనదేశానికి ఇస్తున్న అనేక అంశాల్లో ర్యాంకులు దాదాపు అధ్వానంగా ఉంటున్నా యి. అయినప్పటికీ దేశం అభివృద్ధి చెందుతు న్నది అని చెబుతూ, విగ్రహాలు నెలకొల్పుతూ.. ఇదే అభివృద్ధి అని నమ్మిస్తూ దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేస్తున్నారు. ఇకనైనా పౌర సమా జము వాస్తవాలు గ్రహించాలి. త్వరలో జరగ బోయే ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలి. వి ద్యా, వైద్య రంగానికి, యువతకు ఉద్యోగావ కాశాలు కల్పించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేం దుకు అందరూ కృషి చేయాలి. కార్మిక, కర్షక లోకం మేలు కోరే పార్టీలకు అండదండలు అం దించాలి. అంకెల గారడీ చూసి మోసపోరాదు. కార్పోరేటీకరణ, కాషాయీకరణ వ్యాపారీకరణ కు వ్యతిరేకంగా నిలబడాలి. డా. బిఆర్‌ అంబే ద్కర్‌ రాసిన రాజ్యాంగ ఆశయాల స్ఫూర్తితో ప నిచేసే పార్టీలను, నాయకులను రాబోయే ఎన్ని కల్లో గద్దెనెక్కించడానికి ప్రయత్నాలు ముమ్మ రం చేయాలి. రాబోయే ఐదేండ్లు కీలకమం టూ ప్రస్తుతం పాలిస్తున్న పాలకులు తరచూ ప్రతీ సందర్భంలోనూ మాట్లాడుతూ, మరోసా రి అవకాశం ఇవ్వండి అంటూ అభ్యర్థిస్తున్నారు. ఇక్కడే ప్రజలు, ఓటర్లు జాగురతతో మెలగాలి. అందుకే కాళోజీ నారాయణరావు ఓటు వేసే ముందు ”అభ్యర్థి ఏ పార్టీవాడని కాదు, ఏ పాటి వాడో చూడు.ఎన్నికంటే వెలగబెట్టడం కాదు. ఇప్పటివరకూ ఏంచేసాడో చూడు. పెట్టు కునే టోపీ కాదు, మనకు పెట్టిన టోపీ చూడు” అన న్నారు. నిజమేకదా..!? వాస్తవాన్ని గుర్తించి ఓటు ద్వారా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి.
– ఐ.పి.రావు, 6305682733

Spread the love