కష్టజీవుల దిశానిర్దేశం

The direction of the poorదేశమంతా నిరసన స్వరమై మోగిన శుక్రవారంనాటి ‘భారత్‌బంద్‌’ మోడీ సర్కార్‌కు సవాలుగా నిలిచింది. వ్యవ సాయరంగాన్ని కార్పొరేట్ల హస్తగతం చేసే నిరంకుశ పోక డలకు, ప్రజా వ్యతిరేక విధానాలకు తిరుగులేని హెచ్చరిక చేసింది. ప్రత్యేకించి ప్రధాని మోడీ ఏకఛత్రాధిపత్యానికి ఎదురులేదనే అబద్దపు వాతావరణాన్ని సృష్టించే పన్నాగా లను పటాపంచలు గావించింది. కేంద్రంలోని మోడీ ప్రభు త్వ దుర్మాగపు విధానాలపై దేశవ్యాప్తంగా సంపద సృష్టి కర్తలు పిడికిలెత్తి మరోసారి తమ సత్తాచాటారు. ఢిల్లీని చు ట్టుముట్టిన రైతులకు బాసటగా ఉద్యోగులు, కార్మికులు, కూ లీలు ఒకేసారి రోడ్డెక్కడం ఉద్యమస్ఫూర్తిని రగి లించింది. గ్రామీణ భారత్‌బంద్‌లో ప్రజలు మోడీ విధానాలను తిప్పికొడతామని ప్రతిన బూనడం, ఢిల్లీలో రైతులు తమ ఉద్యమానికి పునరంకితం కావడం వంటి సంకేతాలు చూస్తుంటే బీజేపీ మెడలు విరిచే సమయం ఆసన్నమైందని అర్థమవుతోంది. రైతులు పండిం చే పంటకు కనీస మద్దతు ధరను చట్టబద్ధమైన గ్యారంటీగా అమలు చేయాలని, ప్రభుత్వరంగ సంస్థలను అదానీకి అప్ప గించడాన్ని ఆపాలని, కార్మికుల హక్కులను కాలరాసే నాలు గు లేబర్‌ కోడ్లను వెనక్కి తీసుకోవాలని, వినాశకరమైన విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించాలని కోరు తూ మోడీ, ఆయనను మోసే కార్పొరేట్ల చెవులు చిల్లులు పడేలా శ్రామికలోకం నినదించింది.
సామాన్యుల పొట్టనిండితే ఎంత? నిండకపోతే ఎంత? భజనలు చేసుకుంటే మానసిక ప్రశాంతత వస్తుందంటూ మోడీ మందిరాలు ప్రారంభిస్తూ, ప్రవచనాలు వల్లిస్తూ, కాలయాపన చేస్తున్నారేతప్ప ప్రజల బాధలను ముఖ్యంగా అన్నదాతల ఆక్రందనలను చల్లార్చే తరుణోపాయాలను అన్వేషించడం లేదు. ”చిత్తశుద్ధిలేని శివపూజలేలరా!” అన్న ట్టు… సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనే లేకుండా చర్చలు జరిపే మొక్కుబడి కార్యక్రమంగా అది మారిపోతే ఫలితం శూన్యమే కదా!
రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఆనాడు రైతులు ఢిల్లీని ముట్టడించి, చరిత్ర సృష్టించారు. ఈ నల్ల చట్టాలను నాటి మహా నిరసనల తర్వాత మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కనీస మద్దతుధర గ్యారంటీ వంటి అంశాలపై ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎన్డీఏ సర్కార్‌ వైఫల్యమే తాజాగా రైతులు 2.0 పేరుతో మరోసారి రాజ ధానిని ముట్టడించడానికి కారణభూతమైంది. హర్యానా, పంజాబ్‌ మధ్య శంభు సరిహద్దులో రైతులను చెద రగొట్టడానికి పోలీసులు బాష్ప వాయువు, రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగించి ఉద్రిక్త పరిస్థితులు కల్పిం చడమే కాదు. డ్రోన్ల ద్వారా టియర్‌ గ్యాస్‌లను వాడటం ఎంత దారుణం? ఘాజీపూర్‌, టిక్రీ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి, బ్రిటిష్‌ వారిని తలదన్నేలా మోడీ చేపట్టిన అణచివేత చర్యలు, భయానక దృశ్యాలు ఇంకా కళ్లముందు కదులుతూనే ఉన్నాయి. ఇప్పుడు అదే వ్యవహారం మళ్లీ పునరావృతం అవుతుంది.
రైతులు కోరింది ఆర్థిక భద్రత మాత్రమే. ఉద్యోగులకు పింఛనున్నట్లు రైతుకుండద్దా? అనేది వారి ప్రశ్న. అందుకే అరవై ఏండ్లు నిండిన రైతులకు నెలకు రూ.పదివేల పెన్షన్‌ ఇవ్వాలని చేస్తున్న డిమాండ్‌ సహేతుకమే. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద వ్యవసాయ పనుల కోసం స్థిరమైన రోజువారీ వేతనాలు కోరడం అన్యా యమా? ప్రతిపాదిత వేతనం ఏడాదికి రెండువందల రోజు ల పని హామీతో రోజుకు రూ.700 అడగడం తప్పా? అదా నీకి ఆస్తుల అప్పగింతలో, ఆలయాల నిర్మాణంలో అద్భు తమైన ‘ఫ్రేమ్‌వర్క్‌’ చేసిన ప్రభుత్వం… వ్యవసాయ ఉత్ప త్తులకు మద్దతు ధర హామీనిచ్చే చట్టపరమైన విధివిధా నాల రూపకల్పనకు ఒక్క నిముషమైనా కేటాయించలేకపో వడం శోచనీయం. వ్యవసాయ సమస్యలను పరిష్కరించడా నికి స్వామినాథన్‌ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలని రైతులు కోరడం తప్పేమీ కాదు. ఈ మధ్యనే స్వామినాథన్‌ను భారతరత్నగా కీర్తించిన మోడీ ప్రభుత్వం ఆ కమిటీ సిఫార్సుల పట్ల జాప్యం చేయడం అర్థరహితం. రైతులు తమ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. గత కొన్నేండ్లు సాగు ఖర్చులు పెరిగాయి. వ్యవసాయం నష్టదాయక ప్రక్రియగా మారిపోయింది. రైతులు తమ మొత్తం ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం లాభం పొందేలా చూడాల్సిన అవసరం ఉంది.
ఆంక్షల సంకెళ్లను ఛేదించుకుని ఆసేతు హిమాచలం ఒకటిగా కదం తొక్కడం బంద్‌ విజ యానికి సంకేతం. వ్యవ సాయరంగ పరిరక్షణ కోసం ప్రారంభమైన ఈ ఉద్యమం ”సమస్త ప్రభుత్వరంగాన్నీ కాపాడుకోవాలంటే మోడీ గద్దె దిగాలి” అనే దిశగా రూపుదిద్దుకోవడమే కాదు, కార్మిక, కర్షక మైత్రిని పటిష్టమొనర్చింది. ఈ బంద్‌ నయా ఉదారవాద విధానాలను ఎండగట్ట డమే కాదు, భావి కార్యాచరణకు దారులు వేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాపక్షం వహించే శక్తులకూ, ప్రత్యా మ్నాయ రాజకీయాలకూ దిశానిర్దేశం చేసింది.

Spread the love