దిగజారిన జపాన్‌ జీడీపీ!

Japan's GDP has fallen!ఐదు దశాబ్దాల క్రితం అమెరికాను వెనక్కు నెట్టేసి ఆర్థికంగా మొదటి స్థానంలో ఉంటుందని అనేక మంది భావించిన జపాన్‌ 2010లో చైనా ముందుకు రావ టంతో మూడవదైంది. తాజాగా ఆ స్థానాన్ని కూడా కోల్పో యి జర్మనీ తరువాత నాల్గవదిగా మారింది. జర్మనీ జీడీపీ నాలుగున్నర లక్షల కోట్ల డాలర్లు కాగా జపాన్‌ 4.2లక్షల కోట్లకు పడిపోయింది. జర్మనీ పరిస్థితి కూడా అటూ ఇటూగా ఉంది, అక్కడ కూడా ఆర్థిక వృద్ధి అనుమానంలో పడింది. ఎక్కడైనా వరుసగా రెండు త్రై మాస కాలాల్లో జీడీపీ తిరోగమనంలో ఉంటే ఆ దేశం సాంకేతికంగా మాంద్యం లోకి దిగజారినట్లు భావిస్తారు. గతేడాది చివరి ఆరు నెలల్లో జపాన్‌లో అదే జరిగింది. ఈ కారణంగానే జీడీపీ లో తన స్థానాన్ని కోల్పోయింది. గురువారం నాడు జపాన్‌ విడుదల చేసిన సమాచారం ప్రకారం 2023 జూలై- సెప్టెంబరు మాసాల్లో జీడీపీ వృద్ధి రేటు 0.8, తరువాత మూడు మాసాల్లో 0.1శాతం తిరోగమనంలో ఉన్నట్లు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని లెక్క లను ఖరారు చేశారు. గడచిన రెండు మూడు దశాబ్దా లుగా పక్షవాత రోగి మాదిరిగా ఉన్న అక్కడి అర్థిక వ్యవస్థ తీరుతెన్నులను చూస్తున్న వారికి ఇది ఆశ్చర్యం కలిగిం చదు. జీడీపీ లెక్కింపులో జనాన్ని గందరగోళపరుస్తారు.
నామమాత్ర జీడీపీ వేరు, వాస్తవ జీడీపీ వేరు. నామ మాత్రం అంటే వర్తమానం, తాత్కాలికమైనది. వాస్తవం అంటే ఒక సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని తరు వాత కాలంలో ఆ దేశ కరెన్సీ విలువ తగ్గిందా, పెరిగిందా అన్న అంశాన్ని తీసుకొని ఖరారు చేసేది. ఉదాహరణకు 2010లో ఒక దేశ జీడీపీ వంద అనుకుంటే పదేండ్ల తరువాత 150కి పెరిగిందంటే 50శాతం వృద్ధి కనిపి స్తుంది. కానీ ఈ కాలంలో ఆ దేశ కరెన్సీ విలువ 50 శాతం పడిపోతే పదేండ్ల తరువాత నిజవిలువ 75 మా త్రమే. జపాన్‌ లెక్కలు కూడా అలాంటివే, 2023లో 1.9 శాతం వృద్ధి రేటు నమోదైనట్లు గతంలో ప్రకటించారు. కానీ దిగజారిన కరెన్సీ ఎన్‌ విలువ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆరునెలల కాలంలో తిరోగమన వృద్ధి నమోదైనట్లు ప్రకటించటంతో డాలర్‌ లెక్కల్లో జర్మ నీ కంటే జపాన్‌ జీడీపీ విలువ తగ్గినట్లు పరిగణించాల్సి వచ్చింది. మన దేశంలో కూడా నామమాత్ర జీడీపీ లెక్కలను చూపి కేంద్ర ప్రభుత్వం తమ ఘన త చూడమని చెబుతున్నది, కానీ కొందరు ఆర్థి కవేత్తలు నిజ జీడీపీ విలువ గురించి నిల దీయటంతో నామమాత్ర జీడీపీనే పరిగణనలోకి తీసు కోవాలని మోడీ ప్రభుత్వం దబాయిస్తోంది.
జపాన్‌, జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడి పోయిన తరువాత ఆ దేశాలలో మరోసారి మిలిటరీ నియంతలు తలెత్తకుండా ఉండేందుకు ఆత్మరక్షణ దళా లను మాత్రమే నిర్వహించాలని ఒప్పందాలు జరిగాయి. అందువలన మిలిటరీ ఖర్చును అక్కడి ప్రభుత్వాలు పరిశోధన-అభివృద్ధికి వెచ్చించటంతో రెండు దేశాలు కూడా పారిశ్రామిక, ఎగుమతి రంగాల్లో దూసుకు పోయాయి. ఇటీవలి కాలంలో చైనా పెరుగుతున్న కొద్దీ జపాన్‌ నామమాత్ర వృద్ధితో కొట్టుమిట్టాడుతోంది. ఎగు మతులు బాగా చేసిన కాలంలో సంపాదించుకున్న డాలర్ల మిగులు ఇప్పటికీ ఎంతో ఉంది కనుక ఆ మాత్ర మైనా నిలిచి ఉంది. డాలరుతో పోలిస్తే జపాన్‌ కరెన్సీ ఎన్‌ విలువ గత రెండేండ్లుగా పతనం అవుతున్నది. అందుకే వాస్తవ జీడీపీ విలువ తగ్గుతున్నది. స్థానికంగా జనాలు చేస్తున్న ఖర్చు కూడా తగ్గుతున్నది, పని చేసేం దుకు కార్మికులు లేకపోవటంతో విదేశాల నుంచి దిగు మతి చేసుకుంటున్నారు. మహిళలను మరింతగా ఉత్పాదక రంగంలోకి దించేందుకు వేతనాల పెంపుదల వంటి కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వృద్ధి రేటు మెరుగుపడకపోగా దిగజారుతు న్నది. అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో జన నాల రేటు తగ్గి కార్మిక శక్తి కొరత, వృద్ధుల సంఖ్య పెరుగుతున్నది. ఇంతకాలం రష్యా చౌక ఇంథనం మీద ఆధారపడిన జర్మనీ ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంతో ఇబ్బందుల్లో పడింది. జపాన్‌, జర్మనీలో ఎగుమతుల మీద ఆధారపడిన వ్యవస్థలుగా వృద్ధి చెందాయి. ఇప్పుడు అనేక దేశాల్లో ఏర్పడిన మంద గమనంతో పాటు, చైనా అన్ని రకాల వస్తువు లను చౌకగా ఎగుమతి చేస్తుండటంతో ఎగు మతి ఆధారిత వ్యవస్థలన్నీ ఇబ్బందులను ఎదు ర్కొంటున్నాయి. జపాన్‌ ఎగుమతులు గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతున్నాయి. గతం లో ప్రపంచ మార్కెట్లో ఎక్కడ చూసినా జపాన్‌ టీవీలు, కంప్యూటర్లు, కార్లు కనిపించేవి. ఇప్పుడు చైనా వాటి స్థానాన్ని ఆక్రమించింది. ఇది ఒక్క జపాన్‌ సమస్య మాత్రమే కాదు, పెట్టుబడిదారీ విధానాలను అనుసరిస్తున్న అన్ని సమాజాలు ఎదుర్కొం టున్న సంక్షోభమే ఇది.

Spread the love