ఆరు గ్యారంటీల అమలెప్పుడు?

When will six guarantees apply?2024 ఫిబ్రవరి 10వ తేదీన కాంగ్రెస్‌ ప్రభుత్వం నూతనంగా ఓటాన్‌ అకౌంటు బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2023-24 అసలు బడ్జెట్‌ రూ.2,89,672.65 కోట్లు. కాగా 2024-25 బడ్జెట్‌ 2,74,186.71 కోట్లకు తగ్గించి ప్రస్తుత ప్రభుత్వ చూపడం జరిగింది. అనగా రూ.15,485.94 కోట్లు తగ్గింది. బడ్జెట్‌ తగ్గింపు వలన ఆరు గ్యారెంటీలు, 420 మ్యానిఫెస్టో హామీలు ఎలా అమలు చేస్తారని బీఆర్‌ఎస్‌ ప్రశ్నిస్తోంది. గత బడ్జెట్‌లో కేటా యింపులు ఎక్కువ చూపడం, తక్కువ వ్యయం చేయడం ఆనవాయి తీగా వచ్చింది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం వాస్తవాదా యాలను చూపడంతో గత బడ్జెట్‌పై సుమారు రూ.15 వేల కోట్లు తగ్గింది. అయినప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన అన్ని పథకాలకు నిధులు కేటాయింపు చూపారు. ఆరు గ్యారెంటీలకు రూ.53,196 కేటాయించారు.
రైతుబంధు పథకాన్ని ఎకరాకు రెండు పంటలకు రూ.15వేలకు పెంచుతూ ప్రకటించారు. కానీ, పాస్‌ పుస్త కాలు లేకపోవడం వల్ల అర్హులైన వారికి రైతుబంధు అంద డం లేదు. అర్హులతోపాటు, కౌలుదారులను గుర్తించి వారం దరికీ రైతుబంధు సహాయం చేయాలి. సాగుచేస్తున్న భూములకు రైతుబంధు అందేటట్టు చూడాలి. ఇందుకు రెవెన్యూ రికార్డులను సరిచేయడంతోపాటు ధరణిలో కౌలుదారులను గుర్తించే విధంగా చట్టమార్పిడీ చేయాలి. పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిం చి అమలు చేయాలి. రైతు బీమాను 18-59 సంవత్సరాల నుండి 18-65 సంవత్సరాలకు పెంచాలి. 65 సంవత్సవరాలు దాటిన వారికి పెన్షన్‌ వర్తింపజేయాలి. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ప్రకటించిన 9 పంటలకు మద్దతు అమలు చేయాలి. గతంలో వున్న 6 పంటల మద్దతు ధరలకు మించి వరి రూ.500, మొక్కజొన్న రూ.330, కందులు రూ.400, సోయా రూ.450, పత్తి రూ.475, చెరుకు రూ.85, జొన్నలు రూ.308లు క్వింటాల్‌కు బోనస్‌ చెల్లించాలి. నాణ్యతా ప్రమాణాలు ప్రతి మార్కెట్‌లో టెక్నికల్‌ ఆఫీసర్లను నియ మించాలి. పంటలకు ఇచ్చిన మద్ధతు ధరలను అమలు చేయాలి. మిరప రూ.15వేలు, పసుపు రూ.12వేలు, ఎర్రజొన్న రూ.3500 లకు తగ్గకుండా కొనుగోలు చేయాలి. గతంలో మార్కెట్లలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపి నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలి.
ప్రస్తుతం 100 యూనిట్లలోపు విద్యుత్తు మాఫీకి రాష్ట్రంలో రూ. 1,381.2 కోట్లు సబ్సిడీ ఇస్తున్నాం. అంటే 74 లక్షల కనెక్షన్లకు 3,900 మిలియన్‌ యూనిట్లు ఖర్చు అవుతుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన మరో వంద యూనిట్లు అనగా 200 యూనిట్లు వాడే వారు 30.1 లక్షల మంది వున్నారు. వీరు 5000 మి.యూనిట్లు వాడుతున్నారు. వీరికి రూ.1,958.96కోట్లు సబ్సిడీ కావాలి. 100 యూనిట్ల వాడకం సబ్సిడీ రూ.1381.02 కోట్లు, 100 -200 యూనిట్ల వాడకం సబ్సిడీ రూ.1958.96 కోట్లు. అనగా మొత్తం 3,339.98 కోట్లు మాత్రమే వ్య యం అవుతుంది. 1.04 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూ రుతుంది. అందువల్ల ఇది భారం కాదు. గత దశాబ్ద కాలంగా ఏటా రూ.12వేల కోట్లు ప్రభుత్వం విద్యుత్‌ రంగానికి సబ్సిడీ ఇస్తుంది. అందులో డిస్కంలు దుబారా చేస్తున్నాయి. దానిని నిరోధించాలి.
మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల ప్రభుత్వంపై నెలకు ప్రస్తుత గణాంకాల ప్రకారం రూ.300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఏడాదికి రూ.3600 కోట్లు చెల్లిం చాలి. దీనివల్ల కోట్ల మంది మహిళా ప్రయాణికులు లబ్ది పొందుతున్నారు. ఆర్టీసీలో ఆక్యుపెన్సీ పెరిగింది. అంతేకాకుండా మ హిళలు తమ అవసరాల కొరకు స్వతంత్రంగా మార్కెటింగ్‌కు వెళ్లడం తో పాటు, ఉపాధి సౌకర్యాలను మెరుగ్గా పొందడానికి అవకాశం ఏర్పడింది. ఉచిత ప్రయాణంతో మహిళల్లో చైతన్యం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన సబ్సిడీని చెల్లించడం వల్ల ఆర్టీసి కి ఎలాంటి నష్టం వాటిల్లదు. ప్రయాణానికి అవసరమైన బస్సులను అదనంగా ఏర్పాటు చేయాలి. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులను అవసరమైనంత ఎక్కువ పెంచాలి.
ప్రస్తుతం 5 లక్షల పరిమితి వుండగా ఆరోగ్యశ్రీకి రూ.800 కోట్ల నుంచి రూ.1000 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ యిస్తున్నది. దానిని రూ.10 లక్షలకు పెంపుదల చేయడంతో మరో వెయ్యి కోట్ల అదనపు భారం మాత్రమే పడుతుంది. కానీ లక్షల మంది పేదలు ఈ పథకం వల్ల లబ్ది పొందుతారు. కానీ, పేదలకు నేటికీ వైద్యం అందుబాటులో లేదు. ప్రతీ హాస్పిటల్‌లో ఆరోగ్యమిత్రను ఏర్పాటు చేసి రోగులను ఆరోగ్యశ్రీ లభ్యమయ్యే ఆస్పత్రులకు పంపించాలి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ లేదని, కొన్ని జబ్బులకు ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పి పేద లకు వైద్య సేవలందించకుండా చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలలోనే కాక, దళిత, గిరిజన వెనుకబడిన తరగతులకు చెందిన వారికి ఆరో గ్యశ్రీ అందుబాటులో లేదు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఓటర్‌కార్డు లే వనే సాకుతో వారికి ఆరోగ్యశ్రీని దూరం చేస్తున్నారు. అర్హులైన వా రికి రేషన్‌కార్డులు లేవు. గ్రామీణ ప్రాంతాలలో అనారోగ్యానికి గురైన వారిని దవాఖానాలో చేర్చడానికి 108, 104 వాహనాలను తగిన సౌకర్యాలతో మరిన్ని అందుబాటులో పెట్టాలి. డయాలసిస్‌ కేంద్రా లను ప్రతి మండల కేంద్రంలోని పిహెచ్‌సిలలో పెట్టాలి. మొబైల్‌ వైద్య వాహనాలను అవసరమైన సిబ్బందితో ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలి.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు నిర్మా ణం చేపడతామని బడ్జెట్‌లో రూ.7740 కోట్లు కేటాయింపు చూ పారు. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు సబ్సిడీకి హామీనిచ్చారు. అలాగే ఉద్యమకారులకు 250చ.గ.స్థలాన్ని ఇస్తామ ని ప్రకటించారు. ఇప్పటికే ప్రజా పాలనలో ఈ అంశంపై అనేక దరఖాస్తులు వచ్చాయి. ఇండ్లు లేని వారిని గుర్తించడానికి గ్రామాలు, మురికి వాడలలో సర్వే నిర్వహించాలి. అర్హులను గుర్తించి ఏడాదిలో ఇండ్లు నిర్మాణం జరిగే విధంగా నిధులు విడుదల చేయాలి. గత ఇందిరమ్మ ఇండ్లు, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలి. నిర్మాణాలు పూర్తైన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను అర్హులకు పంపిణీ చేయాలి.
2024లో వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ”రూ.5 లక్షల విద్యా భరో సా కార్డు” ఇస్తామని ప్రకటించింది. ఈ కార్డు ద్వారా రానున్న ఐదేం డ్లలో విద్యార్థులు ఆ డబ్బును తమ విద్యా అవసరాలకు వినియోగిం చుకోవచ్చు. అర్హులకు వెంటనే విద్యా కార్డులివ్వాలి. భవనాలు లేని పాఠశాలలకు నిధులు మంజూరు చేసి భవన నిర్మాణాలు, మౌలిక వసతులు చేపట్టాలి. గత ఫీజు రీ-యింబర్స్‌మెంట్‌ బకాయిలను చెల్లించాలి. రాష్ట్రంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నట్లు నిరంత రం ప్రచారం జరుగుతున్నది. ఉద్యోగ పరీక్షలలో పేపర్‌ లీకేజీల వల్ల ఆశించిన వారికి ఉద్యోగాలు రాలేదు. టిఎస్‌పిఎస్సీని పునరుద్ధరిం చడం జరిగింది. రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఏడాదిలో నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించిన హామీని నిర్ణీత కాలంలో అమలు చేయాలి. గ్రూపు-1,2,3 ల ఉద్యోగాలను భర్తీ చేయడానికి తగు ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య పరిష్కారా నికి ప్రత్యేక ప్రాధాన్యత యివ్వాలి. జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించి నిర్దిష్ట కాలపరిమితిలో అమలు చేయాలి. ప్రతి జిల్లాకు స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలి.
నిరుపేద కుటుంబాలకు ఏటా రూ.12వేలు రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీని వెంటనే అందించాలి. కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రభుత్వం 50 రోజుల పనిదినాలను పెంచటంతోపాటు రోజుకు వంద రూపాయల కూలీ అనగా 350 రూపాయలు పెంచుతామని ప్రకటించింది. వాస్తవానికి 200 రోజుల పనిదినాలకు రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని చాలా కాలంగా వ్యవసాయ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఈ పథకాన్ని పట్టణాలకు కూడా వర్తింప జేయాలి. ఇంతకు ముందున్న జాబ్‌ కార్డులకు తోడుగా కొత్తగా పనిచేసే వారికి జాబ్‌ కార్డులు ఇవ్వాలి. పనిజరిగే స్థలాలలో టెంట్లు, తాగునీరు, పసిపిల్లలకు రక్షణ ఏర్పాట్లు, పనివద్దకు ప్రయాణ సౌకర్యాలు కల్పించాలి. పై సమస్యల పరిష్కారానికి సత్వరమే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి అమలు చేయాలి. గతంలో జరిగిన అవినీతి, కుంభకోణాలు, అక్రమాల పై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలి.
సారంపల్లి మల్లారెడ్డి
9490098666

Spread the love