
– ఒకరిని చూసి మరోకరు చదును చేసుకుంటూ పోలాలు..
– అక్రమణ గురవుతున్న రోడ్డును కాపాడాలని గ్రామస్తుల విజ్ఞప్తి
నవతెలంగాణ – బెజ్జంకి
గత ఏడాది క్రితమే పంచాయితీ రాజ్ నిధులతో ప్రభుత్వం కల్వర్టుల నిర్మాణం చేపట్టి మట్టి రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది.నిర్మాణ పనుల సమయంలో తుతూ మంత్రంగా సందర్శించి సంబంధిత అధికారులు పనులను పర్యవేక్షించారనే ఆరోపణలున్నాయి.మండల కేంద్రం నుండి ఎల్లంపల్లి మీదుగా లక్ష్మిపూర్ గ్రామ శివారు వరకు గత ఏడాది మట్టితో అధికారులు రోడ్డు నిర్మాణం చేపట్టారు. లక్ష్మిపూర్ గ్రామంలోని కొందరు రైతులు తమ భూములను చదునుచేసుకుంటూ రోడ్డును తవ్వి భూమిని దోపిడి చేస్తూ అక్రమించుకుని పోలాలు చేపట్టారు.ఒకరిని చూసి మరోకరు రోడ్డను తవ్వి దోపిడి చేస్తూ అక్రమించుకోవడంతో వాహనాలు సాపీగా వేళ్లలేని పరిస్థితి నెలకొంది.రైతులు రోడ్డును తవ్వి యథేచ్ఛగా దోపిడి చేస్తూ పోలాల చేసుకోవడంతో అధికారులు ఉన్నారా?లేదా?రోడ్డును తవ్వి దోచుకునే వారికి ప్రభుత్వాధికారులు వత్తాసు పలుకుతున్నారంటూ గ్రామస్తులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమణకు గురైన రోడ్డును కాపాడాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మద్యలో నుండి ఇరువైపుల 33 పీట్లు రోడ్డు.. సాజీధ్,ఆర్అండ్ బీ ఏఈ.
ఎల్లంపల్లి-లక్ష్మిపూర్ వరకు మట్టితో నిర్మించిన రోడ్డు ఆర్అండ్ బీ పరిధిలోకి తిసుకువచ్చేల ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాము. ప్రభుత్వం అనుమతుల మేరకు రోడ్డు మద్యలో నుండి ఇరువైపుల సుమారు 33 పీట్ల వరకు రోడ్డుకు తీసుకుంటాము.రోడ్డును తవ్వి రైతులు పోలాలు చేసుకోవడం సరైందికాదు.ప్రభుత్వ అనుమతుల మేరకు రోడ్డు నిర్మాణంలో అక్రమణకు గురైన భూమిని స్వాదీనం చేస్తాం.రోడ్డును సందర్శించి పరిశీలించి చర్యలు చేపడుతాం.