
– ఎక్సైజ్ సీఐ ఎండి అక్బర్ హుస్సేన్
నవతెలంగాణ- జమ్మికుంట: అక్రమ మద్యాన్ని అమ్మిన, నిలువ చేసిన, రవాణా చేసిన అట్టివారిపై చట్టపరమైన చర్యలు తప్పవని జమ్మికుంట ఎక్సైజ్ సీఐ ఎండి అక్బర్ హుస్సేన్ అన్నారు. సోమవారం అక్రమంగా మద్యం బాటిల్లను రవాణా చేస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జమ్మికుంట పట్టణం నుండి హుజురాబాద్ కు వెళ్లే దారి వద్ద దారి కాపలా ఎక్సైజ్ పోలీసులు కాపల నిర్వహించగా, హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డి పేట గ్రామానికి చెందిన అంబటి రమేష్ అనే వ్యక్తి వద్దనుండి6.3 లీటర్ల మద్యం బాటిలను, బజాజ్ ప్లాటినం అనే ద్వి చక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. వీటి విలువ 31 930 రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సైలు రమాదేవి, కబీర్ దాస్, హెడ్ కానిస్టేబుల్ ఐలయ్య ,కానిస్టేబుల్ విశ్వజ్ఞ, రేణుక ,మౌనిక తదితరులు పాల్గొన్నారు.