Friday, May 8, 2026
E-PAPER
Homeజాతీయంబీహార్ లోమంత్రివర్గ విస్తరణ

బీహార్ లోమంత్రివర్గ విస్తరణ

- Advertisement -

నితీశ్ కుమార్‌ కుమారుడు నిశాంత్‌‌తో సహా 32 మంది మంత్రులు ప్రమాణస్వీకారం
పాట్నా : బీహార్‌ ‌రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి సామ్రాట్‌ ‌చౌదరి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కొత్తగా జరిగిన మంత్రివర్గంలోకి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ ‌కుమారుడు నిశాంత్‌ ‌కుమార్‌ ‌చోటు దక్కించుకున్నారు. నిశాంత్‌‌తోపాటు 32 మంది గురువారం మంత్రలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం పాట్నాలో గాంధీ మైదానంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌ ‌షా, రక్షణ శాఖా మంత్రి రాజనాథ్‌ ‌సింగ్‌, బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్‌ ‌నబీన్‌, జెడియు అధ్యక్షులు నితీష్‌‌కుమార్‌‌తోపాటు పలువురు ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. కాగా, కొత్తగా ఏర్పడిన మంత్రివర్గంలో ముఖ్యమంత్రి సామ్రాట్‌ ‌చౌదరితో సహా బీజేపీకి 15 మంత్రి పదవులు, ఇక మిత్రపక్ష పార్టీ జేడీయూకి 13 (ఇద్దరు డిప్యూటీ సిఎంలు : బిజేంద్ర ప్రసాద్‌ ‌యాదవ్‌, విజయ్‌ ‌కుమార్‌ ‌చౌదరి), లోక్‌ ‌జనశక్తి పార్టీ (రామ్‌ ‌విలాస్‌) : ఇద్దరు, హిందుస్తానీ ఆవామ్ మోర్చా (సెక్యులర్) : ఒకరు, రాష్ట్రీయ లోక్ మోర్చా నుంచి ఒకరు మంత్రులుగా గురువారం ప్రమాణం చేశారు. మంత్రివర్గంలో ఓబీసీ, ఈబీసీ, హిందువులు, దళితులు, మహిళలు ఇలా వివిధ సామాజిక వర్గాలకు చెందినవారికి క్యాబినెట్‌‌లో స్థానం కల్పించారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ముఖ్యమంత్రి, ఇద్దరు ఉపముఖ్య మంత్రులతో 35 మందితో కూడిన మంత్రివర్గం ఉంది. 243 అసెంబ్లీ స్థానాలున్న అసెంబ్లీకి గరిష్టంగా 36 మంది మంత్రలు ఉండవచ్చు. తాజాగా ఏర్పడిన కొత్త క్యాబినెట్‌‌లోకి మాజీ సీఎం నితీశ్ కుమార్‌ ‌కుమారుడు నిశాంత్‌ ‌కుమార్‌ (‌జేడీయూ), శ్వేతా గుప్తా (జేడీయూ) మిథిలేష్‌ ‌తివారి (బీజేపీ), శైలేష్‌ ‌కుమార్‌ (‌జేడీయూ))లతో పాటు పలువురు కొత్త క్యాబినెట్‌‌లో మంత్రలుగా ప్రమాణస్వీకారం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -